అది కేవలం మహేష్ బాబుకే సాధ్యం... మావల్ల కాదు: కేటీఆర్

Published : Apr 05, 2019, 03:17 PM ISTUpdated : Apr 05, 2019, 03:28 PM IST
అది కేవలం మహేష్ బాబుకే సాధ్యం... మావల్ల కాదు: కేటీఆర్

సారాంశం

హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామన్న తమ హామీని ఎట్టి పరిస్థితుల్లో నెరవేరుస్తామని మాజీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అయితే అందుకు కొంత సమయం అవసరం అవుతుందన్నారు. కానీ కొందరు ఒక్క రోజులోనే విశ్వనగరంగా తీర్చిదిద్దాలి అన్నట్లుగా మాట్లాడుతున్నారని...అలా చేయడానికి తన వద్ద అల్లావుద్దిన్ అద్భుత ద్వీపం, మంత్రదండం లాంటివి లేవన్నారు. సినిమాలో కేవలం మూడు గంటల్లో అన్నీ జరిగిపోతాయని... అలా చేయడం మహేష్ బాబు వంటి హీరోలకు మాత్రమే సాధ్యమవుతుందని కేటీఆర్ చమత్కరించారు.    

హైదరాబాద్ తాజ్‌ డెక్కన్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ బిల్డర్స్‌ ఫెడరేషన్‌ సమావేశానికి కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన నగర సమస్యలపై ప్రసంగించారు. ప్రజలు సమస్యలతో బాధపడుతుంటే తాము మాత్రం ఆనందంగా వుండలేమన్నారు. పనులు చేయకుండా వారిచేత తిట్లు తిట్టించుకోడానికి తమకేమీ సరదా కాదని...అయితే కొన్ని పనులు చేయాలంటే కాస్త సమయం పడుతుందని పేర్కొన్నారు. ఎన్నో చిక్కముళ్లను చేధించాల్సి వస్తుందని...హైదరాబాద్ వంటి నగరాల్లో మరిన్ని సమస్యలుంటాయని కేటీఆర్ వివరించారు. 

ఇక తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగ అభివృద్దికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుటుందని హామీ ఇచ్చారు. కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారులకే కాదు ఆ రంగంలో పనిచేసే కార్మికుల సంక్షేమం కోసం కూడా పాటుపడతామన్నారు. నిర్మాణాల కోసం అనుమతులతో పాటు ఇతర విషయాల్లో వ్యాపారులకు ఇబ్బందులు ఎదురవకుండా తగిన చర్యలు తీసుకుంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు. 
 
దేశంలో జాతీప పార్టీలుగా చెప్పుకుంటున్న కాంగ్రెస్, బిజెపిలను ప్రజలే నమ్మే పరిస్థితులు లేవని...మోదీ, రాహుల్‌ కలిసినా సంపూర్ణ మెజార్టీ రాదన్నారు. కాబట్టి వివిధ రాష్ట్రాలకు చెందిన పార్టీలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వం అధికారం చేపట్టడం ఖాయమన్నారు. టీఆర్‌ఎస్‌ 16 ఎంపీలు గెలిస్తే ఢిల్లీ జుట్టు మన చేతిలో ఉంటుంది. ప్రాంతీయ పార్టీలకు ఇది మంచి అవకాశమని...ఆ పార్టీలతోనే దేశాభివృద్ధి సాధ్యమని కేటీఆర్‌ వెల్లడించారు. 

PREV
click me!

Recommended Stories

రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.... సంక్రాంతి పండుగకి....
మంత్రి పదవి కన్నా.. వర్కింగ్ ప్రెసిడెంట్‌కే నా ఓటు: కేటీఆర్