గిన్నిస్ బుక్ రికార్డులో నిజామాబాద్ పోలింగ్...ఈసీ లేఖ

By Arun Kumar PFirst Published Apr 12, 2019, 4:53 PM IST
Highlights

తెలంగాణ లోక్ సభ ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాతంగా ముగిశాయి. అయితే ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 17 లోక్ సభ స్ధానాలకు గాను 16 చోట్ల కనిపించని ఉత్కంఠ నిజామాబాద్ పోలింగ్ పై కనిపించింది. అక్కడ ప్రతిక్షణం ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు ప్రజలే కాదు ఇతర రాష్ట్రాలు, తెలుగు, జాతీయ మీడియా సంస్థలు కూడా ఆసక్తిని కనబర్చాయి. అయితే ఎన్నికల కమీషన్ ఈ లోక్ సభ నియోజకర్గంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి మిగతా 16 స్థానాల్లో మాదిరిగానే పోలింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించారు. 
 
ఎంతో చాలెంజ్ తో కూడుకున్న నిజామాబాద్ లో ఎన్నికలను ఎలాంటి ఆటంకం లేకుండా నిర్వహించడంలో సక్సెస్ అయ్యామని ఎన్నికల అధికారి రజత్ కుమార్ తెలిపారు. దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడా నిజామాబాద్ లో మాదిరిగా ఎన్నికలు జరగలేవని...అందువల్లే దీనిపై గిన్నిస్ బుక్ రికార్డుల్లో చేర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. కొత్త తరం ఈవీఎంలతో విజయవంతంగా నిర్వహించిన ఈ ఎన్నికల ప్రక్రియకు తమ రికార్డుల జాబితాలో చేర్చాల్సిందిగా గిన్నిస్ బుక్ వారికి లేఖ రాసినట్లు  రజత్ కుమార్ వెల్లడించారు.

రికార్డు సంఖ్యలో మొత్తం 185 మంది అభ్యర్థులు నిజామాబాద్ లోక్ సభ పోటీలో నిలిచారని  రజత్ కుమార్ గుర్తు చేశారు. దీంతో ప్రతి పోలింగ్ బూత్ లో 12 ఈవీఎం మిషన్లు, ఒక వివిప్యాట్ ను వాడాల్సి వచ్చిందన్నారు. ఇలా లోక్ సభ నియోజకవర్గం మొత్తంలో 27,185 బ్యాలెట్ యూనిట్లు వాడాల్సి వచ్చిందన్నారు. ఇలా ప్రయోగాత్మకంగానే కాకుండా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పోలింగ్ ను విజయవంతంగా ముగించడం ఆనందంగా వుందని పేర్కొన్నారు. ఇలాంటి ఎన్నిక తొలిసారి నిర్వహించినందున దీన్ని గిన్నిస్‌ బుక్‌ రికార్డుల్లో చేర్చాలని కోరుతూ వారికి లేఖ రాశామని రజత్ కుమార్ వెల్లడించారు. 

నిజామాబాద్ లోక్‌సభ స్థానంలో బెల్ కంపెనీ సరఫరా చేసిన ఎం3 ఈవీఎంలను ఈసీ వినియోగించారు. దేశంలో మొదటిసారిగా ఇక్కడే ఎం3 ఈవీఎంలను వినియోగించడం గమనార్హం. ఒక్కో పోలింగ్ కేంద్రంలో ఎల్ ఆకారంలో 12 బ్యాలెట్ యూనిట్లు, ఒక వీవీప్యాట్‌ను అమర్చుతారు. సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించేందుకు ఒక్క నిజామాబాద్ నియోజకవర్గ పరిధిలోనే 600 మంది ఇంజినీర్లను డిప్యూట్ చేశారు.

click me!