కేసీఆర్ కు ప్రధాని బాధ్యతలివ్వాలని లేఖ రాస్తా: వీహెచ్

By Arun Kumar PFirst Published Mar 18, 2019, 4:45 PM IST
Highlights

లోక్ సభ ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్దం మొదలయ్యింది. తెలంగాణ కాంగ్రెస్ ఇంకా ఎంపీ అభ్యర్థులను ఎంపికచేసే ప్రక్రియలో వుండగానే టీఆర్ఎస్, ముఖ్యమంత్రి కేసీఆర్ లపై విమర్శలు ఎక్కుపెట్టింది. ఆ పార్టీ సీనియర్ నాయకులు,  మాజీ ఎంపీ వి హన్మంతరావు ముఖ్యమంత్రి కరీంనగర్  ఎన్నికల ప్రచార సభ ప్రసంగాన్ని ఉద్దేశించి సెటైర్లు విసిరారు. 

జాతీయ పార్టీలమని చెప్పుకునే కాంగ్రెస్, బిజెపి లు కొన్నేళ్లుగా కాశ్మీర్ సమస్యకు పరిష్కారం కనుక్కోలేకపోతున్నాయన్న కేసీఆర్ విమర్శలను వీహెచ్ సెటైరికల్ గా తిప్పికొట్టారు.  కశ్మీర్‌ సమస్యను పరిష్కరిస్తానంటున్న కేసీఆర్ కు ప్రదాని బాధ్యతలు అప్పగించాలని మోదీకి లేఖ రాస్తానన్నారు. దేశంలోనే అత్యంత మేదస్సు కలిగిన మేదావి తెలంగాణలోనే వున్నాడని ఆ  లేఖలో మోదీకి తెలియజేస్తానని కేసీఆర్ పై వీహెచ్ సెటైర్లు విసిరారు.  

అనంతరం వీహెచ్ సొంత పార్టీ నాయకులపై కూడా విమర్శలకు దిగారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒకరి వెంట ఒకరు పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతుంటే టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలను ఆపడం కానీ...ఫిరాయించనున్నట్లు ప్రకటించిన వారిపై చర్యలు తీసుకోవడం గానీ చేయాలని సూచించారు. 

కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఏం జరుగుతుందో...లోక్ సభ ఎన్నికల్లో ఏం జరగబోతోందో తనకు అర్థం కావడం లేదని వీహెచ్ అన్నారు. తాను తెలంగాణ రాజకీయ పరిస్థితులపై రాహుల్ దృష్టికి తీసుకెళదామంటే ఆయన అపాయంట్ మెంట్ కూడా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలా తానుు రాహుల్ ని కలవకుండా అడ్డుపడుతున్నది ఎవరో కూడా అర్థం కావడం లేదని వీహెచ్ తెలిపారు. 

click me!