లోక్ సభ ఫైట్: సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి సవాల్

By Arun Kumar PFirst Published Mar 19, 2019, 3:37 PM IST
Highlights

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్  పాటు ఆయన కుటుంబ సభ్యులను విమర్శించడాన్ని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తగ్గించిన విషయం
తెలిసిందే. అయితే మళ్లీ పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రేవంత్ తన విమర్శనాస్త్రాలను బయటకు తీస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మల్కాజ్ గిరి లోక్ సభ స్థానం నుండి బరిలోకి దిగుతున్న రేవంత్ ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్న కేసీఆర్‌ను తాజాగా తన మాటలతో ఇరుకునపెట్టే ప్రయత్నం చేశారు. ఎక్కడినుండో పోటీ చేయడం కాదు...దమ్ము, దైర్యం వుంటే తనపై మల్కాజ్ గిరి నుండి పోటీ చేయాలని  కేసీఆర్‌కు రేవంత్ సవాల్ విసిరారు. 

ఎన్నికల ప్రచారంలో రేవంత్ మాట్లాడుతూ.... రంగారెడ్డి జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరడాన్ని తప్కపుబట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో తనను పోటీ చేయమని చెప్పి  ఇప్పుడు సబిత టీఆర్ఎస్ లో చేరడం న్యాయమా? అని ప్రశ్నించారు. ఇలా ఉన్నత పదవులను కట్టబెట్టిన పార్టీని వీడటం మంచిది కాదని ఆమెకు సూచించారు. 

ఇక ఎల్బీనగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేపై కూడా రేవంత్ మండిపడ్డారు. సుధీర్ రెడ్డి ఎందుకు టీఆర్ఎస్ లో చేరుతున్నారో సమాధానం చెప్పాలన్నారు. రాజకీయ అవకాశమిచ్చిన పార్టీకి, గెలిపించుకున్న ప్రజలకు ఆయన మోసం చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు.  

 ముఖ్యమంత్రి కేసీఆర్ తమను ప్రశ్నించే ప్రతిపక్షాలను మింగేయాలని చూస్తున్నాడన్నారు. అలా వారి ఆపరేషన్ ఆకర్ష్ కు లొంగని తనలాంటి నాయకులపై అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేధింపులకు దిగుతున్నారని తెలిపారు. ప్రజల కోసం ప్రశ్నిస్తున్నందుకే తనపై అక్రమ కేసులు పెట్టినట్లు రేవంత్ పేర్కొన్నారు. 
 
click me!