టీఆర్ఎస్‌లో చేరిన అనిల్ జాదవ్... 35వేల ఓట్లు టీఆర్ఎస్‌ ఖాతాలోకేనా?

By Arun Kumar PFirst Published Mar 20, 2019, 9:32 PM IST
Highlights

తెలంగాణ కాంగ్రెస్ లో వలసల పరంపర కొనసాగుతూనే వుంది. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ప్రారంభమైన ఈ వలసలు లోక్ సభ ఎన్నికల్లోనూ కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ను వీడనున్నట్లు ప్రకటించగా తాజాగా మరో కీలక నేత కూడా కాంగ్రెస్ ను వీడారు. అంతే  కాదు బుధవారం తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. ఆయనెవరో కాదు కాంగ్రెస్‌ బోథ్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి అనిల్‌ జాదవ్‌.

అనిల్ జాదవ్ తో పాటు అదే జిల్లాకు చెందిన మరో కాంగ్రెస్ నేత గోసుల శ్రీనివాస్ యాదవ్ కూడా టీఆర్ఎస్ లో చేరారు. భారీ సంఖ్యలో అనుచరులు, కార్యకర్తలతో కలిసి తెలంగాణ భవన్ కు వచ్చిన ఈ ఇద్దరు నేతలను కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.... ఈ చేరికలతో బోథ్ నియోజకవర్గం లో కాంగ్రెస్‌ను కూకటి వేళ్ళ తో పెకిలించనట్లయిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీఆఆర్ఎస్ అభివృద్ది, ప్రజా సంక్షేమ కార్యకలాపాలను మెచ్చి లక్షలాదిమంది ఈ పార్టీలో చేరుతున్నారని అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో కూడా చాలామంది ఇంకా టీఆర్ఎస్ లో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. 

 గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడి ఇండిపెండెంట్ గా పోటీ చేసి కూడా అనిల్ జాదవ్ 35 వేల ఓట్లు తెచ్చుకోవడం చాలా గొప్ప విషయమన్నారు. దీన్ని బట్టే ఆయనకు ప్రజల్లో వున్న అభిమానం ఎలాంటిదో ఆర్థమవుతోందన్నారు. అలాంటి నాయకుడు లోక్ సభ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ లో చేరడం పార్టీకి మరింత కలిసొచ్చే అంశమేనని కేటీఆర్ పేర్కొన్నారు.  
 
పార్లమెంటు ఎన్నికల్లో కెసిఆర్ కు ఎందుకు ఓటేయాలని ప్రశ్నిస్తున్న వారికి కేటీఆర్ జవాభిచ్చారు. తెలంగాణ నుంచి కాంగ్రెస్ ,బీజేపీ ఎంపీలు గెలిస్తే రాహుల్ ,మోడీ లకే లాభం...తెలంగాణ కు ఎలాంటి లాభం లేదన్నారు.  కానీ 16 మంది టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణ కే లాభమని తెలిపారు. మోడీ ,రాహుల్ వ్యక్తిగతంగా లాభ పడాలా?తెలంగాణ లాభ పడాలా ? అని కేటీఆర్ ఎదురు ప్రశ్నించారు. 

గత లోక్ సభ ఎన్నికల్లో వున్న హవా ఇప్పుడు మోడీకి లేదన్నారు. ఇక కాంగ్రెస్ రాహుల్ ది ఎప్పుడూ హవానే లేదు. కాబట్టి ఈ కీలక సమయంలో కాంగ్రెస్ ,బీజేపీ లకు కీలెరిగి వాత పెట్టాలన్నారు. తెలంగాణ పాలన దేశానికి ఆదర్శము కావాలంటే 16 మంది గులాబీ సైనికు లు పార్లమెంట్ లో ఉండాలని పేర్కొన్నారు. 

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన వారికి కాంగ్రెస్ మళ్లీ ఎంపీ టికెట్లిచ్చిందని కేటీఆర్ గుర్తు చేశారు. అసెంబ్లీ నియోజక వర్గాలలో చెల్లని రూపాయలు పార్లమెంటు నియోజకవర్గాల్లో ఎలా చెల్లుతుందంటూ ఎద్దేవా చేశారు. చినిగి పోయిన నోటు ఎక్కడయినా చినిగిన నోటే... ఆ నోటు ఎక్కడా చెల్లదని కేటీఆర్ కాంగ్రెస్ అభ్యర్థులపై సెటైర్లు వేశారు. 

click me!