2016లో గూగుల్ సంస్థ యూట్యూబ్ గోను విడుదల చేసింది. కనెక్టివిటీ తక్కువగా ఉండి, ప్రాసెసర్ స్లోగా ఉండి, లిమిటెడ్‌గా టెక్నాలజీ అందుబాటులో ఉండే లో ఎండ్ మొబైల్ ఫోన్స్ వినియోగిస్తున్న యూట్యూబ్ క్రియేటర్స్ కోసం యూట్యూబ్ తరహాలో 'యూట్యూబ్ గో'ను అందుబాటులోకి తెచ్చింది. కానీ యూట్యూబ్‌ను ఎలా డెవలప్ చేసిందో ఆ స్థాయిలో యూట్యూబ్ గోను అభివృద్ధి చేయడం అసాధ్యంగా మారింది.
ప్రపంచ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ తమ సర్వీసుల్లో ఒక్కొక్కటిగా షట్ డౌన్ చేస్తోంది. ఇప్పటికే పలు సర్వీసులను గూగుల్ నిలిపివేసింది. పెద్దగా ప్రాచూర్యం పొందని యాప్ సర్వీసులను గూగుల్ షట్‌డౌన్ చేస్తోంది. అందులో భాగంగానే గూగుల్ Youtube Go App సర్వీసును త్వరలో షట్ డౌన్ చేయాలని ప్లాన్ చేస్తోంది. 2016లో ఈ Youtube Go App సర్వీసును గూగుల్ ప్రారంభించింది. అయితే ఈ యాప్ మెయిన్ Youtube యాప్‌కు సేమ్ వెర్షన్.. అందుకే Youtube Go App సర్వీసును నిలిపివేయాలని భావిస్తోంది. ఈ యాప్‌కు యూజర్ల నుంచి పెద్దగా ప్రాధాన్యత లభించకపోవడంతో గూగుల్ ఈ దిశగా నిర్ణయం తీసుకుంది.
వచ్చే ఆగస్టు నుంచి YouTube Go యాప్ అందుబాటులో ఉండదని కంపెనీ ప్రకటించింది. ఈ మేరకు యూట్యూబ్ అధికారిక బ్లాగ్ పోస్ట్‌లో గూగుల్ ప్రకటించింది. ఈ యాప్ ద్వారా యూజర్లు నేరుగా మెయిన్ Youtube యాప్‌కు మైగ్రేట్ అవుతున్నారు. దాంతో ఎన్నో ఏళ్లుగా ఈ యాప్ కనెక్టివిటీ నిరూపయోగంగా మారింది. వాస్తవానికి ఈ YouTube Go యాప్ ప్రధానంగా కనెక్టివిటీ లో-ఎండ్ మొబైల్ ఫోన్ల కోసం గూగుల్ తీసుకొచ్చింది. ప్రధాన Youtube యాప్ ఎక్కువగా వినియోగంలో ఉండటంతో ఈ యాప్ సర్వీసును నిలిపివేయడమే కరెక్ట్ అనే భావనలో సెర్చ్ ఇంజిన్ దిగ్గజం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
undefined
‘YouTube Go ఆగస్ట్‌లో షట్ డౌన్ అవుతుందని ప్రకటిస్తున్నాం. YouTubeని యాక్సెస్ చేయాలంటే ఇకపై YouTube Go యూజర్లు ప్రధాన YouTube యాప్‌ని తమ ఫోన్లలో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. లేదంటే.. బ్రౌజర్‌లలో youtube.comని విజిట్ చేయాలి. YouTube Goతో పోల్చితే.. మెయిన్ YouTube యాప్ మెరుగైన వినియోగదారు అనుభవాన్ని అందిస్తుంది. YouTube Goలో లేని ఫీచర్‌లను అందిస్తుంది.. యూజర్లు కామెంట్ చేయడం, పోస్ట్ చేయడం, కంటెంట్‌ను క్రియేట్ చేయడం, డార్క్ థీమ్ ఆకర్షణీయంగా ఉన్నాయని కంపెనీ అధికారిక బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది.
ప్రధాన YouTube యాప్‌పై దృష్టి
ఇటీవలి కాలంలో ప్రధాన యాప్‌లో అనేక మార్పులు చేస్తున్నట్టు యూట్యూబ్ తెలిపింది. ఈ అప్‌గ్రేడ్‌లు ప్రధాన యాప్‌ను ఎంట్రీ లెవల్ లేదా లో-ఎండ్ డివైజ్‌ల్లోని నెట్‌వర్క్ యూజర్లు సులభంగా యాక్సస్ చేసుకునేలా అనుమతినిస్తుందని కంపెనీ వెల్లడించింది. స్లో నెట్ వర్క్ యూజర్లకు కూడా సులభంగా యూట్యూబ్ యాక్సస్ చేసుకునేలా Youtube యాప్‌ను మెరుగుపరిచామని బ్లాగ్ పోస్టులో గూగుల్ పేర్కొంది. మొబైల్ డేటా వినియోగాన్ని తగ్గించడంలో భాగంగా పరిమిత డేటాతోనే యూట్యూబ్ వీక్షించేలా అదనపు యూజర్ కంట్రోల్ వ్యవస్థను రూపొందించనున్నట్టు గూగుల్ పోస్టులో వెల్లడించింది.