పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో సరికొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. యూజర్లు ఇండివిడ్యువల్ మూవీలను రెంట్‌లో చూసుకునేలా ‘పే పర్ వ్యూ’ సర్వీసును తీసుకొచ్చింది. ఈ సర్వీసు ప్రైమ్ సబ్ స్క్రైబర్లకు, నాన్ ప్రైమ్ సబ్ స్క్రైబర్లకు అందుబాటులోకి ఉంటోంది.
ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) కొత్త సర్వీసును లాంచ్ చేసింది. భారత మార్కెట్లో New Amazon Prime Store లాంచ్ చేసింది. ఈ సర్వీసు కేవలం ప్రైమ్ వీడియో సబ్ స్కైబర్ల కోసమే కాదు.. నాన్ ప్రైమ్ సబ్ స్క్రైబర్ల కూడా వినియోగించుకోవచ్చు. ప్రత్యేకించి భారతీయ ప్రైమ్ వీడియో వినియోగదారుల కోసం కంపెనీ ఈ సర్వీసును ప్రవేశపెట్టింది. దీని ద్వారా యూజర్లు మూవీలను రెంట్ తీసుకోవచ్చు. అది ప్రాంతీయ భాష మూవీలు కావొచ్చు.. అంతర్జాతీయ మూవీలు కావొచ్చు.. మీకు నచ్చిన మూవీలను రెంటుకు తెచ్చుకోవచ్చు.
ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఏదైనా మూవీ చూడాలంటే కచ్చితంగా సబ్ స్క్రిప్షన్ ఉండాల్సిందే. లేదంటే ప్రైమ్ వీడియో కంటెంట్ యాక్సస్ చేసుకోలేరు. భారత్ లో అమెజాన్ లాంచ్ చేసిన ప్రైమ్ వీడియో స్టోర్ ద్వారా మీకు నచ్చిన ఏదైనా ఒక మూవీని ఎలాంటి సబ్ స్క్రిప్షన్ ఫీజు చెల్లించకుండానే వీక్షించవచ్చు. కానీ, మీరు చూసే మూవీకి మాత్రమే రెంట్ ఛార్జీ చెల్లిస్తే సరిపోతుంది. అమెజాన్ ప్రైమ్ సర్వీసు అందించే ఈ మూవీ రెంటల్ సర్వీసు.. గూగుల్ రెంట్ మూవీ ఆప్షన్ మాదిరిగానే పనిచేస్తుంది. ఇప్పటికే సెర్చ్ ఇంజిన్ దిగ్గజం Youtube, Amazon Transaction Video-On-Demand (TVoD) సర్వీసుతో పనిచేస్తుంది.
undefined
ఈ Prime Video Store సర్వీసు కేవలం subscribers మాత్రమే కాదు.. నాన్ సబ్ స్క్రైబర్లు కూడా వీక్షించవచ్చు. అమెజాన్ ప్రైమ్‌లో ఏదైనా మూవీని చూడాలంటే సబ్ స్క్రిప్షన్ అవసరం లేదు. మీరు చూసే మూవీకి మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. అమెజాన్ ప్రైమ్ స్టోర్‌లో మూవీ రెంట్ ధరలు రూ.69 నుంచి రూ. 499 వరకు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో యూజర్ ఎవరైనా ఒక మూవీని రెంట్‌కు తీసుకుంటే.. 30 రోజుల్లో ఎప్పుడైనా వీక్షించవచ్చు. కానీ, ఒకవేళ మూవీని మీరు చూడటం స్టార్ట్ చేస్తే మాత్రం.. ఆ మూవీని 48 గంటల్లోగా పూర్తి చేయాలి. ఈ డెడ్ లైన్ మిస్ అయితే మాత్రం.. ఆ మూవీని తిరిగి చూడలేరు.
అమెజాన్ ప్రైమ్ వీడియో ఆన్ డిమాండ్ స్ట్రీమింగ్ సర్వీసు భారత్‌తో ఐదేళ్లను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ముంబైలో నిర్వహించిన ఈవెంట్‌లో ఈ ఏడాది ప్రైమ్ వీడియోపై రాబోతున్న వెబ్ సిరీస్‌లపై ప్రకటన చేసింది. 140 కోట్ల జనాభాతో ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశంగా ఉన్న భారత్.. అమెజాన్‌కు, నెట్‌ఫ్లిక్స్‌కు, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌కు కీలకమైన మార్కెట్‌గా ఉంది. పే పర్ మూవీ ఫీచర్‌ను కస్టమర్లకు అందుబాటులోకి తేవడంపై తాము చాలా ఆనందంగా ఉన్నట్టు అమెజాన్ ప్రైమ్ వీడియో హెడ్ గౌరవ్ గాంధీ చెప్పారు. ఈ సర్వీసు కస్టమర్ల రీచ్‌ను, ఎంపికను పెంచుతుందన్నారు.