డిసెంబర్ 2న ట్విట్టర్ ఈ సర్వీస్ మళ్లీ ప్రారంభం.. మూడు కలర్స్ లో బ్లూ టిక్..

By asianet news teluguFirst Published Nov 26, 2022, 12:36 PM IST
Highlights

మైక్రో బ్లాగ్గింగ్ సైట్ ట్విట్టర్‌లో గోల్డ్ చెక్ మార్క్ కంపెనీలకి, ప్రభుత్వానికి బూడిద కలర్, సామాన్యులకు బ్లూ టిక్ ఉంటుంది. అంతేకాకుండా వెరిఫై చేయబడిన అన్ని అక్కౌంట్స్ కి రీ-వెరిఫికేషన్ ఉంటుంది. 

టెస్లా సి‌ఈ‌ఓ, బిలియనీర్ ఎలోన్ మస్క్ ట్విట్టర్ బ్లూ సర్వీస్‌ మళ్లీ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ట్విట్టర్ బ్లూ సర్వీస్  డిసెంబర్ 2న రిలాంచ్ చేయనుంది. ట్విట్టర్ బ్లూ అనేది ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ సర్వీస్. ట్విట్టర్ బ్లూని తిరిగి ప్రారంభించడంతో ఇప్పుడు ట్విట్టర్ టిక్ (చెక్ మార్క్) కలర్ కూడా భిన్నంగా ఉండనుంది.

మైక్రో బ్లాగ్గింగ్ సైట్ ట్విట్టర్‌లో గోల్డ్ చెక్ మార్క్ కంపెనీలకి, ప్రభుత్వానికి బూడిద కలర్, సామాన్యులకు బ్లూ టిక్ ఉంటుంది. అంతేకాకుండా వెరిఫై చేయబడిన అన్ని అక్కౌంట్స్ కి రీ-వెరిఫికేషన్ ఉంటుంది. ఇంతకు ముందు రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, జర్నలిస్టులు, సెలబ్రిటీలకు ట్విట్టర్‌లో బ్లూ టిక్‌లు ఉండేవి. ట్విట్టర్ బ్లూను మళ్లీ ప్రారంభించడంలో ఆలస్యమైనందుకు ఎలోన్ మస్క్ క్షమాపణలు కూడా చెప్పారు.

ట్విట్టర్ బ్లూ కోసం సబ్‌స్క్రిప్షన్ 
ట్విట్టర్ యూజర్లు ఇప్పుడు బ్లూ టిక్ కోసం సబ్‌స్క్రిప్షన్ చార్జ్ చెల్లించాలి. యూ‌ఎస్ అండ్ ఇతర దేశాలలో బ్లూ టిక్ కోసం $8 డాలర్లు చార్జ్ అని చెప్పబడుతున్నప్పటికీ, భారతదేశంలో Twitter బ్లూ టిక్ కోసం రూ.720. కొత్త సర్వీస్‌తో పాటు వర్చువల్ జైలు సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి. కొత్త అప్‌డేట్ తర్వాత పాలసీ ఉల్లంఘన జరిగితే యూజర్ల అక్కౌంట్ పై చర్యలు తీసుకోబడతాయి ఇంకా అకౌంట్‌తో పాటు బ్యాన్ ఎప్పుడు తొలగిపోతుందో కూడా వెల్లడిస్తారు.

బ్యాన్ చేసిన అక్కౌంట్స్ రిస్టోర్ద్
 అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ అక్కౌంట్ రిస్టోర్ద్ తర్వాత సస్పెండ్ చేయబడిన ఇతర అక్కౌంట్స్ కోసం 'జెనరల్ అంనెస్టీ' ప్రారంభిస్తానని ఎలోన్ మస్క్ చెప్పారు.

click me!