ప్రముఖ స్మార్ట్ బ్రాండ్ షావోమీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో దూసుకుపోతోంది. వరుసగా స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తూ భారత మార్కెట్లో విస్తరిస్తోంది. షావోమీ.. ఏడేళ్ల అనంతరం ఇపుడు “Smart Pad 5″ను భారత్ లో విడుదల చేయనుంది.
చైనా స్మార్ట్ ఫోన్ సంస్థ షావోమీ దాదాపు ఏడేళ్ల అనంతరం స్మార్ట్ ట్యాబ్ ను తిరిగి భారత మార్కెట్లోకి తీసుకురానుంది. చివరగా 2015లో “Mi-Pad”ను భారత్ లో విక్రయించిన షావోమీ.. ఏడేళ్ల అనంతరం ఇపుడు “Smart Pad 5″ను భారత్ లో విడుదల చేయనుంది. ఈమేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది సంస్థ.
ఏప్రిల్ 27న “Xiaomi 12 pro” స్మార్ట్ ఫోన్ సహా ఈ సరికొత్త స్మార్ట్ ట్యాబ్ ను విడుదల చేయనున్నట్లు సంస్థ తెలిపింది. అయితే ఈ “Smart Pad 5″ను గతేడాదిలోనే చైనాలో విడుదల చేసిన షావోమీ సంస్థ..అక్కడ అనుకున్నంత ఆదరణ దక్కక పోవడంతో దీనికి pro వెర్షన్ తీసుకువచ్చింది. అయితే ప్రస్తుతం భారత్ లో మాత్రం స్టాండర్డ్ వేరియంట్‌నే విడుదల చేయనుంది.
Xiaomi ప్యాడ్ 5 ఫీచర్లు
11-అంగుళాల 2.5K LCD డిస్‌ప్లే(WQHD+)తో వస్తున్న ఈ స్మార్ట్ ప్యాడ్ 5లో స్నాప్‌డ్రాగన్ 860 చిప్ ప్రాసెసర్, 8720mAh (typ) అధిక సామర్థ్యం కలిగిన బ్యాటరీ, డాల్బీ అట్మాస్ సౌండ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఆధారిత MIUI 12.5 ఓఎస్ తో ఈ ట్యాబ్ పనిచేస్తుంది. వేగవంతమైన 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన డిస్ప్లే ప్యానల్ 10బిట్ కలర్ డెప్త్ మరియు యాంబియంట్ లైటింగ్ కి అనుగుణంగా కలర్ టెంపరేచర్ మార్చుకుంటుంది.
డాల్బీ విజన్ మరియు HDR10 ప్లేబ్యాక్ సపోర్ట్ చేస్తుంది. డాల్బీ అట్మోస్ ఫీచర్ తో వస్తున్న ఈ స్మార్ట్ టాబ్లెట్ తో క్వాడ్ స్పీకర్ సెటప్ కూడా ఉంది. ఈ టాబ్లెట్‌లో వెనుక 13MP మరియు ముందు భాగంలో 8MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను అమర్చారు. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 8,720mAh బ్యాటరీతో ఈ స్మార్ట్ ట్యాబ్ పనిచేస్తుంది. వీటితో పాటుగా స్మార్ట్ మాగ్నెటిక్ కీబోర్డ్ కవర్, ఛార్జబుల్ బ్యాటరీతో కూడిన Xiaomi స్టైలస్ pen కూడా ఈ ప్యాడ్ 5తో వస్తుంది. 6GB + 128GB వేరియంట్, 8GB + 256GB వేరియంట్లలో లభించే ఈ స్మార్ట్ ప్యాడ్ 5 ధర మాత్రం ఇంకా తెలియరాలేదు.