Twitter Update:ఒక కొత్త ఫీచర్ తీసుకోస్తున్న ట్విట్టర్.. వీరు మాత్రమే ఈ ఫీచర్‌ ఉపయోగించుకోవచ్చు..

By asianet news telugu  |  First Published Apr 18, 2022, 1:08 PM IST

ట్విట్టర్ ఇప్పుడు ఎడిట్ బటన్‌పై పని చేస్తోంది. ట్విట్టర్ ఎడిట్ ఫీచర్ మొదటిసారిగా వెబ్ వెర్షన్‌లో కనిపించింది. ట్విట్టర్ ఎడిట్ ఫీచర్ అందరికీ అందుబాటులో లేనప్పటికీ, వెబ్ తర్వాత త్వరలో అండ్రాయిడ్, ఐ‌ఓ‌ఎస్ కోసం ఈ ఫీచర్ విడుదల చేయబడుతుందని భావిస్తున్నారు.


మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌లో ఎడిట్ బటన్ కోసం డిమాండ్ ఉన్నంత వేగంగా, ఈ ఫీచర్‌ను తీసుకురావడంలో కంపెనీ ఆలస్యం చేస్తోంది. తాజాగా ట్విట్టర్ ఎడిట్ బటన్ పై వర్క్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ట్విట్టర్ ఎడిట్ ఫీచర్ మొదటిసారిగా వెబ్ వెర్షన్‌లో కనిపించింది. Twitter ఎడిట్ ఫీచర్ అందరికీ అందుబాటులో లేనప్పటికీ, వెబ్ తర్వాత త్వరలో Android అండ్ iOS యూజర్ల కోసం ఈ ఫీచర్ విడుదల చేయబడుతుందని భావిస్తున్నారు.

నివేదిక ప్రకారం, ట్విట్టర్  లో ట్విట్టర్ బ్లూ యూజర్లకు మాత్రమే ఎడిట్ బటన్ ఫీచర్‌ను అందిస్తుంది. Twitter బ్లూ అనేది సంస్థ ఫీజు ఆధారిత సేవ. Twitter ఎడిట్ బటన్‌ను మొదట డెవలపర్  అలెశాండ్రో పలుజ్జీ నివేదించారు. అతను ఎడిట్ బటన్ స్క్రీన్ షాట్‌ను కూడా షేర్ చేశాడు.

Latest Videos

undefined

స్క్రీన్‌షాట్ ప్రకారం, ట్విట్టర్  ఎడిట్ బటన్ ట్వీట్‌తో కనిపించే మూడు-చుక్కల మెనులో ఉంటుంది. ఫీచర్  అప్ డేట్ తర్వాత, వినియోగదారులు ట్వీట్‌ను ఎడిట్ లేదా మళ్లీ వ్రాయడానికి ఆప్షన్ పొందుతారు, అయితే ఇది ప్రస్తుతం టెస్టింగ్ లో ఉంది. అటువంటి పరిస్థితిలో లాంచ్ కి ముందే దానిలో మార్పులు ఉండవచ్చు.

మరో ట్విట్టర్ యూజర్  కూడా Twitter ఎడిట్ బటన్ యానిమేషన్‌ను షేర్ చేసారు. ట్విట్టర్ కూడా 1 ఏప్రిల్ 2022న ఈ ఫీచర్ గురించి ట్వీట్ చేసింది, కానీ ప్రజలు దీనిని ఏప్రిల్ ఫూల్‌గా పరిగణించారు. ఇటీవల టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసేందుకు ఆఫర్ చేయగా ఎడిట్ బటన్ కోసం పోల్‌ను కూడా పోస్ట్ చేశారు. కాగా, ఎడిట్ బటన్ గురించి ట్విట్టర్ ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు.

Twitter బ్లూ అనేది కంపెనీ  సబ్‌స్క్రిప్షన్ ఆధారిత సర్వీస్. Twitter బ్లూ సబ్‌స్క్రిప్షన్‌లో వినియోగదారులు ట్వీట్ కింద ఇంకా యాడ్స్ లేకుండా వార్తా కథనాలను(news stories) చదివే అవకాశాన్ని పొందుతారు. ఇందుకు ప్రతి నెల ధర $ 2.99 అంటే దాదాపు రూ. 222.
 

click me!