దీపావళి తర్వాత ఈ స్మార్ట్‌ఫోన్‌లలో వాట్సాప్‌ పనిచేయదు.. మీ ఫోన్ కూడా ఈ లిస్ట్ లో ఉందా ?

By asianet news telugu  |  First Published Oct 24, 2022, 12:42 PM IST

 నిజానికి ప్రతి సంవత్సరం వాట్సాప్‌  పాత ఆపరేటింగ్ సిస్టమ్‌లకు సపోర్ట్ నిలిపివేస్తుంది. సపోర్ట్ ఆపివేయడం అంటే కొన్ని డివైజెస్ కి వాట్సాప్‌ కొత్త అప్ డేట్స్ విడుదల చేయదు. 


మీరు ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ ఉపయోగిస్తే మీకో బ్యాడ్ న్యూస్. నిజానికి అక్టోబర్ 24న తర్వాత  చాలా స్మార్ట్‌ఫోన్‌లలో వాట్సాప్‌  పనిచేయడం ఆగిపోతుంది. మీ ఫోన్  ఔట్ డెటెడ్  ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతున్నట్లయితే వాట్సాప్‌ అందులో పనిచేయడం ఆగిపోవచ్చు. అయితే ఈ ఫోన్లలో ఆపిల్ వంటి పెద్ద కంపెనీ ఫోన్లు కూడా ఉన్నాయి.


నిజానికి ప్రతి సంవత్సరం వాట్సాప్‌ ఎన్నో పాత ఆపరేటింగ్ సిస్టమ్‌లకు  సపోర్ట్ నిలిపివేస్తుంది. సపోర్ట్ ఆపివేయడం అంటే కొన్ని డివైజెస్ కి వాట్సాప్‌  కొత్త అప్ డేట్స్ విడుదల చేయదు. ముందుగా ఇన్‌స్టాల్ చేసిన యాప్ పని చేస్తూనే ఉంటుంది కానీ అప్‌డేట్‌లు లేకపోవడం వల్ల యాప్‌కి కొత్త ఫీచర్లు లభించవు అలాగే సెక్యూరిటీకి సంబంధించిన రిస్క్ ఉంటుంది. ఈ సంవత్సరం కూడా అక్టోబర్ 25 నుండి చాలా ఫోన్లకు వాట్సాప్‌  సపోర్ట్ ఆగిపోనుంది. 

Latest Videos

undefined

వాట్సాప్‌ ఈ ఫోన్‌లలో
మీకు ఐ‌ఓ‌ఎస్ 10, ఐ‌ఓ‌ఎస్ 11, ఐఫోన్  5, ఐఫోన్  5సి ఉంటే మీ ఫోన్‌లో  అక్టోబర్ నుండి వాట్సాప్‌ పనిచేయదు. అయితే వాట్సాప్‌  యాప్ అప్‌డేట్ చేయడం ద్వారా మీరు వాట్సాప్‌ను ఉపయోగించవచ్చు. దీనికి సంబంధించి iOS 10, iOS 11 నడుస్తున్న ఐఫోన్‌లలో వాట్సాప్ సపోర్ట్ నిలిపివేయబడుతుందని ఆపిల్ తెలిపింది. అంటే వాట్సాప్‌ iOS 12 లేదా ఆపై ఉన్న అన్ని ఆపరేటింగ్ సిస్టమ్‌లలో వాట్సాప్‌  రన్ అవుతుంది. మీరు iOS 11ని ఉపయోగిస్తే  ఇందులో వాట్సాప్‌ ని  ఉపయోగించాలనుకుంటే  మీరు కొత్త iOSకి అప్‌డేట్ కావాల్సి ఉంటుంది.

 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల గురించి మాట్లాడేటప్పుడు ఆండ్రాయిడ్ 4.1 అండ్ అంతకంటే ఎక్కువ వెర్షన్ ఉన్న ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులందరూ వాట్సాప్‌ ని ఉపయోగించవచ్చు. ఆండ్రాయిడ్ 4.1 కంటే తక్కువ వెర్షన్ ఉన్న ఫోన్‌ల యూజర్లందరూ వాట్సాప్‌ ఉపయోగించలేరు. 
 

click me!