కరోనా మహమ్మారి సమయంలో ముఖ్యంగా ప్రజలు ఫోన్‌లపై గడిపే సమయం పెరిగినపుడు స్పామ్ కాల్స్ కూడా చాలా పెరిగాయి. ఇప్పుడు మీరు అలాంటి స్పామ్ కాల్స్ ని వదిలించుకోవాలనుకుంటే, ఒక పర్మనెంట్ మార్గం ఉంది.
స్పామ్ కాల్స్ ఎవరు కోరుకుంటారు..? మీరు కూడా కోరుకోరని ఖచ్చితంగా తెలుసు. అయితే స్పామ్ కాల్స్ లో మూడు రకాల స్కామ్ కాల్స్ ఉన్నాయి 1) టెలిమార్కెటింగ్ కాల్స్, 2) రోబో కాల్స్, 3) స్కామ్ కాల్స్. ఈ మూడు రకాల కాల్స్ ఒకోసారి చాలా బాదిస్తుంటాయి, కొన్నిసార్లు భయానకంగా ఉంటాయి. కరోనా మహమ్మారి సమయంలో ముఖ్యంగా ప్రజలు ఫోన్‌లపై గడిపే సమయం పెరిగినపుడు స్పామ్ కాల్స్ కూడా చాలా పెరిగాయి. ఇప్పుడు మీరు అలాంటి స్పామ్ కాల్స్ ని వదిలించుకోవాలనుకుంటే, ఒక పర్మనెంట్ మార్గం ఉంది... ఆశ్చర్యపోయారు కదా..
గూగుల్ అండ్రాయిడ్ యూజర్ల కోసం స్పామ్ కాల్స్ నుండి రక్షించే రెండు ఫీచర్స్ అందిస్తుంది. ఈ ఫీచర్స్ కాలర్ ఐడి అండ్ స్పామ్ ప్రొటెక్షన్. ఆండ్రాయిడ్ ఫోన్‌లలో డిఫాల్ట్‌గా ఈ రెండు ఫీచర్లు ఆన్ చేసి ఉంటాయి, వీటిని యూజర్లు ఎప్పుడైనా ఆఫ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. ఈ ఫీచర్‌లు ఎలా పనిచేస్తాయో మీకు తెలియకపోతే, ఈ విధంగా తెలుసుకోండి. మీ అండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో కాలర్ ఐడి అండ్ స్పామ్ ప్రొటెక్షన్ ఫీచర్‌లను ఆన్ చేయడం ఇంకా స్పామ్ కాల్స్ పర్మనెంట్ గా బ్లాక్ చేయడం ఎలాగో ఇక్కడ తెలుసుకోండి..
undefined
స్టెప్ 1: మీ అండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో కాల్స్ చేసేందుకు ఫోన్ యాప్‌ని ఓపెన్ చేసి పైన ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేయండి.
స్టెప్ 2: సెటింగ్స్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఓపెన్ చేయండి.
స్టెప్ 3: స్పామ్ అండ్ కాల్ స్క్రీన్ ఆప్షన్ పై నొక్కండి.
స్టెప్ 4: సీ కాలర్ & స్పామ్ ఐడి ఆప్షన్ ఆఫ్ చేస్తే ఆన్ చేయండి.
ఈ ఆప్షన్స్ మీకు పని చేయకపోతే అండ్రాయిడ్ యూజర్లు కాల్స్ స్పామ్‌గా గుర్తించవచ్చు. అయితే కొన్ని సెట్టింగ్‌లను మార్చడం ద్వారా వాటిని మాన్యువల్‌గా బ్లాక్ చేయవచ్చు. కాల్స్ స్పామ్‌గా ఎలా గుర్తించాలో ఇక్కడ ఉంది:
స్టెప్ 1: మీ అండ్రాయిడ్ ఫోన్‌లో ఫోన్ యాప్‌ని తెరవండి.
స్టెప్ 2: ఇక్కడ రీసెంట్ ట్యాబ్‌పై నొక్కండి.
స్టెప్ 3: ఇప్పుడు మీరు స్పామ్‌గా రిపోర్ట్ చేయాలనుకుంటున్న కాల్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 4: తరువాత బ్లాక్ లేదా రిపోర్ట్ స్పామ్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.