వాట్సాప్ కొత్త ఫీచర్.. దీన్ని ఎలా ఉపయోగించాలో తెలుసా..

By asianet news telugu  |  First Published Nov 17, 2022, 6:06 PM IST

వాట్సాప్ పోల్స్ ఇప్పుడు అండ్రాయిడ్ అండ్ ఐ‌ఓ‌ఎస్ లో కూడా ఉపయోగించవచ్చు. గ్రూప్ చాట్‌లు, ప్రైవేట్ చాట్‌లు రెండింటికీ వాట్సాప్ పోల్స్‌ను ఉపయోగించవచ్చు.  
 


మెటా యజమాన్యంలోని ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ చాలా కాలంగా పోల్ ఫీచర్‌ను పరీక్షిస్తోంది అయితే ఇప్పుడు ఈ ఫీచర్‌ను యూజర్లకు లాంచ్ చేసింది. వాట్సాప్ పోల్స్ ఇప్పుడు Android అండ్ iOSలో ఉపయోగించవచ్చు. గ్రూప్ చాట్స్, ప్రైవేట్ చాట్స్ రెండింటికీ వాట్సాప్ పోల్స్‌ను ఉపయోగించవచ్చు. వాట్సాప్ పోల్స్ కోసం యూజర్లకు 12 ఆప్షన్స్ అందించవచ్చు. ఈ ఫీచర్‌ని ఉపయోగించే ముందు మీరు యాప్‌ను అప్‌డేట్ చేయడం అవసరం. ఈ ఫీచర్ ఎలా ఉపయోగించాలంటే...

వాట్సాప్ పోల్స్ ఎలా ఉపయోగించాలి?
మీ వాట్సాప్ యాప్‌ని ఓపెన్ చేసి గ్రూప్ చాట్ లేదా ఏదైనా చాట్‌ని ఓపెన్ చేయండి 
ఇప్పుడు Android ఫోన్‌లోని అటాచ్‌మెంట్ బటన్ అండ్ iOSలోని (+) బటన్‌పై క్లిక్ చేయండి.
ఇప్పుడు మీరు లొకేషన్, కాంటాక్ట్ మొదలైనవి కనిపించే కింద పోల్ ఆప్షన్ చూస్తారు.
ఇప్పుడు 'ఆస్క్  క్వషన్'పై క్లిక్ చేయండి. ఇక్కడ ఓటింగ్ ఆప్షన్‌  ఎంటర్ చేయండి. దీని కోసం మీరు 12 ఆప్షన్స్ ఉంటాయి.
మీరు పోల్‌ను ఫిక్స్ చేశాక  సెండ్ చేయవచ్చు 
ఒక వ్యక్తి పోల్‌లో ఒక్కసారి మాత్రమే ఓటు వేయవచ్చు.

Latest Videos

గ్రూప్ చాట్‌లో ప్రొఫైల్ ఫోటో
వాట్సాప్ మరో ఫీచర్‌ను కూడా ప్రారంభించింది, దీంతో గ్రూప్ చాట్‌లో  గ్రూప్ లోని మెంబర్స్  ప్రొఫైల్ ఫోటోను కూడా చూడవచ్చు. WhatsApp ఈ కొత్త ఫీచర్ టెస్టింగ్ ప్రస్తుతం బీటా వెర్షన్‌లో జరుగుతోంది. వాట్సాప్ ఫీచర్లను ట్రాక్ చేసే Wabetainfo కొత్త ఫీచర్ గురించి సమాచారం ఇచ్చింది.

click me!