ఆపిల్ ఐఫోన్ 13ని మైమరిపించేల మార్కెట్లోకి కొత్త ఫోన్.. దీని ధర తెలిస్తే నిజంగా నమ్మలేరు..

By asianet news telugu  |  First Published Nov 17, 2022, 2:20 PM IST

లీటి‌వి వై1 ప్రొ + ధర 499 చైనీస్ యువాన్ అంటే దాదాపు రూ. 5,700. ఈ ధరలో 4జి‌బి ర్యామ్, 64 జి‌బి స్టోరేజ్ వేరియంట్ లభిస్తుంది.  4 GB ర్యామ్, 128 జి‌బి స్టోరేజ్ ధర 599 యువాన్లు అంటే దాదాపు రూ. 6,800.


అమెరికన్ టెక్ కంపెనీ ఆపిల్  ఐఫోన్ గురించి ప్రతిఒక్కరికీ  తెలిసిందే. దీని ధర, ఫీచర్స్  లేదా డిజైన్ పరంగా ప్రతిసారి హైలెట్ గా నిలుస్తుంది. ఇప్పుడు లీటి‌వి వై1 ప్రొ+ పేరుతో ఒక కొత్త ఫోన్ ని చైనాలో ప్రవేశపెట్టింది, దీని డిజైన్ ఐఫోన్ 13ని పోలి ఉంటుంది. లీటి‌వి వై1 ప్రొ+  డిజైన్‌ని మొదటిసారి చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవచ్చు. లీటి‌వి వై1 ప్రొ+   డిస్ప్లేతో లభించే నాచ్ కూడా ఐఫోన్ 13 లాగానే ఉంటుంది. లీటి‌వి వై1 ప్రొ+తో  256 జి‌బి స్టోరేజ్ లభిస్తుంది

లీటి‌వి వై1 ప్రో+ ధర
లీటి‌వి వై1 ప్రొ + ధర 499 చైనీస్ యువాన్ అంటే దాదాపు రూ. 5,700. ఈ ధరలో 4జి‌బి ర్యామ్, 64 జి‌బి స్టోరేజ్ వేరియంట్ లభిస్తుంది.  4 GB ర్యామ్, 128 జి‌బి స్టోరేజ్ ధర 599 యువాన్లు అంటే దాదాపు రూ. 6,800, 4 జి‌బి ర్యామ్,  256 జి‌బి స్టోరేజ్ ధర 699 యువాన్లు అంటే దాదాపు రూ. 8,000. లీటి‌వి వై1 ప్రొ+ని JD.com నుండి మిడ్‌నైట్ బ్లాక్, స్టార్‌లైట్ అండ్ స్టార్ బ్లూ కలర్స్ లో కొనుగోలు చేయవచ్చు.

Latest Videos

undefined

లీటి‌వి వై1 ప్రొ+ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో లీటి‌వి వై1 ప్రొ+లో అందించారు. లీటి‌వి వై1 ప్రొ+ 6.5-అంగుళాల ఎల్‌సి‌డి డిస్‌ప్లే, ఐఫోన్ 13 సిరీస్ వంటి నాచ్, బాడీ గ్లాస్ అండ్  ఆక్టాకోర్ హుబెన్ T610 ప్రాసెసర్ ఇచ్చారు. దీనితో పాటు 4 జి‌బి  ర్యామ్, 128జి‌బి స్టోరేజ్ కూడా ఉంది.

లీటి‌వి వై1 ప్రో+ కెమెరా
లీటి‌వి ఫోన్ కి ఐఫోన్ 13 లాంటి కెమెరా సెటప్‌ ఉంది, దీని ప్రైమరీ లెన్స్ 8 మెగాపిక్సెల్‌, ఇతర లెన్స్‌ల గురించి సమాచారం లేదు. ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఫోన్‌లో టైప్-సి పోర్ట్, కనెక్టివిటీ కోసం ఫేస్ అన్‌లాక్ ఉన్నాయి. 4000mAh బ్యాటరీతో ఫోన్ మొత్తం బరువు 195 గ్రాములు.

click me!