ఈ ఏడాది మేలో వాట్సాప్ గ్రూప్ మెంబర్స్ సంఖ్యను మారుస్తు 256 నుంచి 512కి మార్చింది. ఇప్పుడు వాట్సాప్ ఈ లిమిట్ కూడా రెట్టింపు చేయాలని ఆలోచిస్తోంది. WABetaInfo నివేదిక ప్రకారం, వాట్సాప్ ప్రస్తుతం ఈ ఫీచర్‌ని బీటా టెస్టర్‌లకు లిమిట్ చేసింది.
మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త కొత్త ఫీచర్లను అందించడానికి ఎప్పటికప్పుడు వివిధ మార్పులు చేస్తూనే ఉంది. ఇప్పుడు వాట్సాప్ గ్రూప్స్ లో పెద్ద మార్పు చేయబోతోంది. WABetaInfo ప్రకారం, వాట్సాప్ ఇప్పుడు గ్రూప్స్ లో యాడ్ మెంబర్స్ లిమిట్ పెంచబోతోంది. ఈ అప్‌డేట్ తర్వాత వాట్సాప్ గ్రూప్‌లో 1024 మందిని యాడ్ చేసుకోవచ్చు.
ఈ ఏడాది మేలో వాట్సాప్ గ్రూప్ మెంబర్స్ సంఖ్యను మారుస్తు 256 నుంచి 512కి మార్చింది. ఇప్పుడు వాట్సాప్ ఈ లిమిట్ కూడా రెట్టింపు చేయాలని ఆలోచిస్తోంది. WABetaInfo నివేదిక ప్రకారం, వాట్సాప్ ప్రస్తుతం ఈ ఫీచర్‌ని బీటా టెస్టర్‌లకు లిమిట్ చేసింది. త్వరలో ఈ ఫీచర్ ఇతర యూజర్లకు అందుబాటులోకి రానుంది. వాట్సాప్ 2GB వరకు ఫైల్‌లను షేర్ చేయడానికి అప్‌డేట్‌ను విడుదల చేయబోతోందని కూడా వార్తలు వస్తున్నాయి.
undefined
వాట్సాప్ ప్రీమియం
వాట్సాప్ బినీనెస్ యాప్ యూజర్ల కోసం వాట్సాప్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను కూడా ప్రారంభించింది, అయితే ప్రస్తుతం కొంతమంది యూజర్లు మాత్రమే దాని అప్ డేట్ పొందుతున్నారు. బీటా యూజర్ల కోసం వాట్సాప్ ప్రీమియం అప్‌డేట్ విడుదల చేసింది. బీటా యూజర్లు యాప్‌లో ప్రీమియం మెనూని చూడవచ్చు. ప్రీమియం మెనులో యూజర్లు ఎన్నో అదనపు ఫీచర్లను చూస్తారు.
ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ బిజినెస్ యాప్‌కు మాత్రమే. మీరు సాధారణ యూజర్లు అయితే, మీరు చింతించాల్సిన అవసరం లేదు. ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ కింద బిజినెస్ యాప్ యూజర్ కాంటాక్ట్ లింక్‌ని కస్టమైజ్ ఆప్షన్ పొందుతారు.
ప్రీమియం అప్‌డేట్ వచ్చిన తర్వాత ఫోన్ నంబర్‌ను టైప్ చేయకుండానే బిజినెస్ అక్కౌంట్ కి కనెక్ట్ చేయవచ్చు. టెలిగ్రామ్‌లో ఇప్పటికే ఇలాంటి ఫీచర్ ఉంది. ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ కోసం యూజర్లు చార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. దీని ప్రయోజనం ఏమిటంటే, మీరు ఒకే నంబర్ నుండి 10 డివైజెస్ లో ఒకే అక్కౌంట్ ఉపయోగించవచ్చు. అంతేకాకుండా ఒకేసారి 32 మందితో వీడియో కాల్స్ చేసుకోవచ్చు.
కొన్ని రోజుల క్రితం కాల్ లింక్ ఫీచర్
జూమ్ అండ్ గూగుల్ మీట్ వంటి వీడియో కాలింగ్ లింక్‌లను షేర్ చేసే ఫీచర్‌తో వాట్సాప్ కూడా వస్తోందని మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ చెప్పారు. ఈ లింక్ సహాయంతో ఎవరైనా ఏదైనా గ్రూప్ కాల్ లేదా మీటింగ్‌లో చేరవచ్చు.