మోటో ఈ32 ఎకో బ్లాక్, ఆర్కిటిక్ బ్లూ కలర్స్ లో ప్రవేశపెట్టరు. 64జిబి స్టోరేజ్ 4జిబి ర్యామ్ ధర రూ. 10,499. Moto E32ని ఆన్‌లైన్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ నుండి కొనుగోలు చేయవచ్చు.
స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మోటరోల కొత్త బడ్జెట్ ఫోన్ మోటో ఈ32ను ఇండియాలో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఇండియాకి ముందే యూరోపియన్ మార్కెట్‌లో ప్రవేశపెట్టారు. మోటో ఈ32 MediaTek Helio G37 ప్రాసెసర్, 90Hz రిఫ్రెష్ రేట్, 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 5,000mAh బ్యాటరీతో వస్తుంది. స్మార్ట్‌ఫోన్ ఇతర స్పెసిఫికేషన్‌లు, ధర గురించి తెలుసుకుందాం...
మోటో ఈ32 ధర
మోటో ఈ32 ఎకో బ్లాక్, ఆర్కిటిక్ బ్లూ కలర్స్ లో ప్రవేశపెట్టరు. 64జిబి స్టోరేజ్ 4జిబి ర్యామ్ ధర రూ. 10,499. Moto E32ని ఆన్‌లైన్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ నుండి కొనుగోలు చేయవచ్చు.
undefined
మోటో ఈ32 ఫీచర్స్
మోటో ఈ32కి 6.5-అంగుళాల HD+ ఎల్‌సిడి డిస్‌ప్లే ఉంది, ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. MediaTek Helio G37 ప్రాసెసర్‌తో ఆండ్రాయిడ్ 12కి సపోర్ట్ చేస్తుంది. ఫోన్ 4జిబి ర్యామ్ తో 64 జిబి స్టోరేజ్‌కు సపోర్ట్ చేస్తుంది. మైక్రో ఎస్‌డి కార్డ్ సహాయంతో Moto E32 స్టోరేజ్ 1TB వరకు పెంచుకోవచ్చు.
మోటో ఈ32 కెమెరా
50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో Moto E32కి డ్యూయల్ కెమెరా సెటప్ లభిస్తుంది. సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్, సెల్ఫీ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
మోటో ఈ32 బ్యాటరీ
5,000mAH బ్యాటరీ ఫోన్‌తో వస్తుంది, అలాగే 10W ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ కోసం, Moto E32 డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.0, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, సేఫ్టీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌కు సపోర్ట్ చేస్తుంది. ఫోన్ బరువు 185 గ్రాములు.