బాస్కెట్‌బాల్ డిజైన్ లో సరికొత్త ఇయర్‌బడ్స్.. స్పొర్ట్స్, అడ్వెంచర్, ఫిట్‌నెస్ చేసే వారికి కోసం..

Published : Aug 25, 2022, 01:19 PM IST
బాస్కెట్‌బాల్ డిజైన్ లో  సరికొత్త ఇయర్‌బడ్స్.. స్పొర్ట్స్, అడ్వెంచర్, ఫిట్‌నెస్ చేసే వారికి కోసం..

సారాంశం

వింగాజోయ్ BT-220 వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ఒకే కలర్ లో లాంచ్ చేసారు. దీని ధర రూ.2,990. ఈ ఇయర్‌బడ్స్ ని  ప్రముఖ రిటైల్ స్టోర్‌ల నుండి కొనుగోలు చేయవచ్చు. 

గాడ్జెట్ ఆక్సెసరీ అండ్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ వింగాజోయ్ కొత్త ఇయర్‌బడ్స్ వింగాజోయ్ BT-220ని ఇండియాలో లాంచ్ చేసింది. ఈ ఇయర్‌బడ్స్ బాస్కెట్‌బాల్ ఆకారపు డిజైన్‌లో ప్రవేశపెట్టారు. VingaJoy BT-220 ఇయర్‌బడ్స్ 20 గంటల బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది కంపెనీ పేర్కొంది. దీనిలో బ్లూటూత్ v5.1 అండ్ టచ్ కంట్రోల్ ఫీచర్‌కు సపోర్ట్ ఇచ్చారు. 

ధర 
వింగాజోయ్ BT-220 వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ఒకే కలర్ లో లాంచ్ చేసారు. దీని ధర రూ.2,990. ఈ ఇయర్‌బడ్స్ ని  ప్రముఖ రిటైల్ స్టోర్‌ల నుండి కొనుగోలు చేయవచ్చు. ఇయర్‌బడ్స్‌కు కంపెనీ నుండి 6 నెలల వారంటీ కూడా లభిస్తుంది. 

 స్పెసిఫికేషన్‌లు అండ్ ఫీచర్‌లు 
వింగాజోయ్ నుండి వస్తున్న ఈ ఇయర్‌బడ్స్‌ బాస్కెట్‌బాల్ ఆకారం, స్పోర్టీ ఫిట్ డిజైన్‌లో పరిచయం చేసారు. ఇంకా చాలా తక్కువ బరువు ఉంటుంది, స్పోర్ట్స్ చేసేటప్పుడు లేదా డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా దీనిని ఉపయోగించవచ్చు. కంపెనీ ప్రకారం, టైప్-సి ఫాస్ట్ ఛార్జింగ్‌తో ఇయర్‌బడ్స్‌లో మంచి సౌండ్ క్వాలిటీ ఉంటుంది. బ్యాటరీకి సంబంధించి ఫుల్ ఛార్జ్‌పై 20 గంటల ప్లేబ్యాక్ అండ్ స్టాండ్‌బై మోడ్‌లో 200 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ లభిస్తుందని కంపెనీ పేర్కొంది. VingaJoy BT-220 ఇయర్‌బడ్స్‌ టచ్ కంట్రోల్ ఫీచర్‌తో పాటు డ్యూయల్ ఇన్-బిల్ట్ మైక్‌కి కూడా సపోర్ట్ చేస్తాయి. అంతేకాకుండా, ఈ ఇయర్‌బడ్స్‌లో బ్లూటూత్ v5.1 సపోర్ట్ కూడా అందించారు. 

వింగాజోయ్ సహ వ్యవస్థాపకుడు లలిత్ అరోరా మాట్లాడుతూ  ఇండియాలో స్పొర్ట్స్, అడ్వెంచర్, ఫిట్‌నెస్ లవర్స్ కోసం ఆడియో అనుభవాన్ని మెరుగుపరచే ప్రయత్నంలో వింగ్‌జాయ్  కొత్త అండ్ వినూత్న ఉత్పత్తులను తీసుకురావడం కొనసాగిస్తున్నట్లు ఈ ప్రారంభోత్సవ సందర్భంగా తెలిపారు. ఈ కొత్త ఇయర్‌బడ్స్ జిమ్‌లో వర్కవుట్ చేస్తున్నప్పుడు ఎక్కువ మ్యూజిక్ వినే వారికి మన్నికైనవి ఇంకా సౌకర్యవంతంగా ఉంటాయి. ట్రు వైర్‌లెస్ అనుభవంతో మా కస్టమర్‌ల అనుభవాన్ని సరికొత్త స్థాయికి తీసుకెళ్లాలని మేము ఎదురుచూస్తున్నాము అని అన్నారు.

PREV
click me!

Recommended Stories

Kitchen Gadgets: ఇంకా.. ఇవే పాత కాలం ప‌ట్క‌ర్ల‌ను వాడుతున్నారా.? అప్డేట్ అవ్వండి బ్రో
Flipkart Big Billion Days Sale: ఫ్లిప్‌కార్ట్‌లో ఏసీలు సగం ధరకే.. బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్లు