పిన్ ఇంట్రెస్ట్ అంటే ఏమిటి, ఎలా పని చేస్తుంది, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుండి ఎంత భిన్నంగా ఉంటుంది?

By asianet news teluguFirst Published May 13, 2022, 11:55 AM IST
Highlights

పిన్ ఇంట్రెస్ట్ ఇతర సోషల్ మీడియా యాప్‌ల కంటే కొంచెం భిన్నంగా ఉంటుంది. ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో వినియోగదారులు వారికి నచ్చిన సమాచారాన్ని ఫోటోలు లేదా GIFల ద్వారా ఒకే చోట పొందవచ్చు.

ప్రస్తుత కాలాన్ని సోషల్ మీడియా యుగం అంటారు. ఈరోజుల్లో ప్రజలు చాలా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఆక్టివ్ గా ఉంటుంన్నారు. Facebook, Telegram, Whatsapp, Instagram వంటి సోషల్ మీడియా లాగానే Pinterest కూడా ఒక సోషల్ మీడియా. దీనిలో అక్కౌంట్ క్రియేట్ చేయడం ద్వారా ఫోటోలు, వీడియోలు, కంటెంట్‌ను షేర్ చేసుకోవచ్చు. Pinterest ఇతర సోషల్ మీడియా యాప్‌ల నుండి కొంచెం భిన్నంగా ఉన్నప్పటికీ ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో యూజర్లు వారికి నచ్చిన ఫోటోలు లేదా GIFల ద్వారా ఒకే చోట చూడవచ్చు. ఈ యాప్ ని Google Play Store ఇంకా Apple Play Store నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

అమెరికాలో ప్రధాన కార్యాలయం
Pinterest ఒక అమెరికన్ కంపెనీ. దీనిని 2010లో స్థాపించారు. ప్రస్తుతం ప్రధాన కార్యాలయం USAలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో ఉంది. Pinterest యాప్ Android ఇంకా iPhone రెండింటికీ అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ వినియోగదారులు దీన్ని Google Play Store నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, అయితే iPhone వినియోగదారులకు ఈ యాప్ Apple App Storeలో అందుబాటులో ఉంది.  Gmail అక్కౌంట్ సహాయంతో చాలా సులభంగా ఐ‌డి  క్రియేట్ చేసుకోవచ్చు.  మీరు బిజినెస్ అక్కౌంట్ క్రియేట్ చేయడం ద్వారా మీ ప్రాడక్ట్ లేదా సర్వీస్ సులభంగా ప్రచారం చేయవచ్చు. 


ఇమేజ్ షేరింగ్ సోషల్ మీడియా 
ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ప్రత్యేకంగా ఫోటోల కోసం ఉపయోగించబడుతుంది. ఈ యాప్‌లో యూజర్ వివిధ రకాల ఫోటోలను సులభంగా పొందుతారు. ఇంకా ఫోటోల కోసం వివిధ క్యాటగిరిస్ కూడా ఉన్నాయి. Pinterestని ఇమేజ్ షేరింగ్ సోషల్ మీడియా అని కూడా అంటారు. ఇందులో ఫోటోలు ఇంకా GIFల ద్వారా ఏదైనా విషయంపై సమాచారాన్ని కనుగొనవచ్చు. Pinterest వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు. ఈ యాప్‌లో 250 మిలియన్ల ఆక్టివ్ యూజర్లు ఉన్నారు.

ఇతర మీడియా ప్లాట్‌ఫారమ్‌ 
Pinterest ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల కంటే భిన్నంగా ఉంటుంది. ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ద్వారా యూజర్లు వ్యాపారానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేయడం ద్వారా  వ్యాపారాన్ని మరింత పెంచుకోవచ్చు. అంతే కాకుండా యూట్యూబ్ వీడియోల వ్యూయర్ షిప్ కూడా దీని ద్వారా తీసుకోవచ్చు. దీనితో పాటు, ఈ యాప్ ద్వారా వినియోగదారులు  బ్లాగ్ లేదా వెబ్‌సైట్  ఫోటోను లింక్‌తో షేర్ చేయడం ద్వారా వెబ్‌సైట్ ట్రాఫిక్‌ను పెంచుకోవచ్చు.

ఎన్నో రకాల ఫీచర్లు 
Pinterest ఫీచర్స్ గురించి మాట్లాడినట్లయితే దానిలో చాలా రకాల ఫీచర్స్ ఉన్నాయి. ఇంకా ఇతర మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుండి భిన్నంగా ఉంటుంది. ఇందులో వివిధ కేటగిరీల్లో ఫోటోలను ఉంచారు. వినియోగదారులు వారు చూడాలనుకుంటున్న కేటగిరీపై క్లిక్ చేయడం ద్వారా వారికి ఇష్టమైన ఫోటోలను సులభంగా వీక్షించవచ్చు ఇంకా షేర్ చేయవచ్చు. దీనికి పిన్నింగ్ ఫీచర్ కూడా ఉంది. దీనితో పాటు ఒక బోర్డు లేదా ఫోటోల గ్రూప్ అందులో చేయవచ్చు. దీనితో పాటు, Google Analytics వంటి Pinterestలో అనలిటిక్స్ సౌకర్యం కూడా ఉంది. ఇందులో ఎంత మంది పోస్ట్‌ను షేర్ చేసారు లేదా క్లిక్ చేసారు అనేది కూడా చూడవచ్చు. అయితే, Pinterestలో బిజినెస్ అక్కౌంట్ ఉన్న వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. దీనితో పాటు, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల లాగానే మెసేజెస్ పంపే ఫీచర్‌ ఉంది.
 

click me!