Realme Smart TV X FHD: ఫుల్‌ HD డిస్‌ప్లే, 24W స్పీకర్లతో రియల్‌మీ Smart TV లాంచ్..!

By team teluguFirst Published May 12, 2022, 11:24 AM IST
Highlights

రియల్‌మీ నుంచి మరో రెండు స్మార్ట్ టీవీలు (Smart TV) లాంచ్ అయ్యాయి. రియల్‌మీ స్మార్ట్ టీవీ ఎక్స్ ఎఫ్‌హెచ్‌డీ సిరీస్‌లో 40 ఇంచులు, 43 ఇంచుల డిస్‌ప్లే వేరియంట్లలో వచ్చాయి. Full-HD రెజల్యూషన్ డిస్‌ప్లేలు, 24W సౌంట్ ఔట్‌పుట్ ఇచ్చే స్పీకర్లు, ఆండ్రాయిడ్‌ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ టీవీలు వస్తున్నాయి.
 

రియల్‌మీ స్మార్ట్ టీవీ ఎక్స్ ఎఫ్‌హెచ్‌డీ ( Realme Smart TV X FHD ) సిరీస్ భారత్‌లో విడుదలైంది. 40 ఇంచుల, 43 ఇంచుల డిస్‌ప్లే వేరియంట్‌లో ఫుల్‌హెచ్‌డీ రెజల్యూషన్‌ (Full HD Resolution)తో ఈ కొత్త స్మార్ట్ టీవీలు ( Smart TVs ) వచ్చేశాయి. డాల్బీ అట్మోస్‌ సపోర్ట్ ఉన్న నాలుగు స్పీకర్లు ఈ టీవీల్లో ఉండగా.. గరిష్ఠంగా 24వాట్ల సౌండ్ అవుట్‌పుట్ ఇస్తాయి. ఈ కొత్త రియల్‌మీ స్మార్ట్ టీవీలు బెజిల్‌లెస్ డిజైన్‌లో వస్తున్నాయి. అందుకే అంచులు లేకుండా చూసేందుకు చాలా ప్రీమియమ్‌గా కనిపిస్తాయి. ఈ టీవీలు HDR 10, HGL ఫార్మాట్‌కు కూడా సపోర్ట్ చేస్తాయి. ఆండ్రాయిడ్‌ 11 ( Android 11 ) ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతాయి. Realme Smart TV X FHD టీవీల పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర, సేల్‌ వివరాలు చూడండి.

Realme Smart TV X FHD ధర, సేల్‌ వివరాలు
రియల్‌మీ సార్ట్ టీవీ ఎక్స్ ఎఫ్‌హెచ్‌డీ 40 ఇంచుల మోడల్ ధర రూ.22,999గా ఉంది. 43 ఇంచుల డిస్‌ప్లే వేరియంట్ ధర రూ.25,999గా రియల్‌మీ నిర్ణయించింది. 40 ఇంచుల మోడల్ సేల్‌ మే 4న మొదలవుతుంది. 43 ఇంచుల వేరియంట్ మే 5న అమ్మకానికి వస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart), రియల్‌మీ ఆన్‌లైన్ స్టోర్‌(realme.com)తో పాటు రిటైల్ స్టోర్స్‌లోనూ ఈ టీవీలు అందుబాటులో ఉంటాయి.

Realme Smart TV X FHD స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
Full-HD (1,920x1,080) రెజల్యూషన్ ఉన్న LED డిస్‌ప్లేతో రియల్‌మీ స్మార్ట్ టీవీ ఎక్స్ ఎఫ్‌హెచ్‌డీ టీవీలు వస్తున్నాయి. 40 ఇంచులు, 43 ఇంచుల డిస్‌ప్లే వేరియంట్లు ఉన్నాయి. HDR 10, HGL ఫార్మాట్లకు ఈ టీవీలు సపోర్ట్ చేస్తాయి. క్రోమా బూస్ట్ పిక్చర్ ఇంజిన్ వల్ల ఈ టీవీలు అల్ట్రా బ్రైట్‌నెస్ కలిగి ఉంటాయని రియల్‌మీ పేర్కొంది. కలర్, కాంట్రాస్ట్, క్లారిటీ అత్యుత్తమంగా ఉంటాయని తెలిపింది. క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెసర్.. ఈ రియల్‌మీ స్మార్ట్ టీవీ ఎక్స్ ఎఫ్‌హెచ్‌డీ టీవీల్లో ఉంటుంది. 1జీబీ ర్యామ్, 8జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంటాయి.

ఆండ్రాయిడ్‌ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌పై Realme Smart TV X FHD టీవీలు రన్ అవుతాయి. కొన్ని యాప్స్ ప్రీలెడెడ్‌గా వస్తుండగా.. కావాల్సిన యాప్స్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. డాల్బీ ఆడియో సపోర్ట్ ఉన్న నాలుగు స్టీరియో స్పీకర్లు ఈ టీవీలకు ఉంటాయి. మొత్తంగా 24W సౌండ్ ఔట్‌పుట్‌ను ఇస్తాయి. గూగుల్ అసిస్టెంట్, క్రోమ్‌కాస్ట్‌ సపోర్ట్ కూడా ఉంటుంది. రెండు HDMI పోర్ట్‌లు, ఓ HDMI (ARC) పోర్ట్, రెండు USB పోర్ట్‌లు, 3.5mm ఆడియో జాక్, AV, SPDIF, ఎథెర్‌నెట్ పోర్ట్ ఈ టీవీలకు ఉంటాయి.

click me!