అంతర్జాతీయ షోలో వరంగల్ యువత ఘనత.. ఇ-నోవేట్ అవార్డును గెల్చుకున్న 'సంస్కర్ టాయ్'

By asianet news telugu  |  First Published Jul 2, 2021, 6:59 PM IST

పోలాండ్‌లో జరిగిన అంతర్జాతీయ ప్రదర్శనలో వరంగల్ యువకులు 'సంస్కర్ టాయ్' ఇ-న్నోవేట్ అవార్డును గెలుచుకున్నారు. ఈ బొమ్మ పిల్లలకు లైంగిక వేధింపులపై  'మంచి స్పర్శ' అలాగే 'చెడు స్పర్శ' గురించి నేర్పుతుందని తెలిపారు.
 


హైదరాబాద్: పోలాండ్‌లో జరిగిన ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ ఆన్‌లైన్ షోలో వరంగల్ చెందిన 21 ఏళ్ల  ఇన్నోవేటర్ యాకర గణేష్‌  అభివృద్ధి చేసిన సంస్కర్ టాయ్ 2021 ఇ-న్నోవేట్ అవార్డును గెలుచుకుంది. ఈ బొమ్మ పిల్లలకు లైంగిక వేధింపులపై  'మంచి స్పర్శ' అలాగే 'చెడు స్పర్శ' గురించి నేర్పుతుంది.

వాగ్‌దేవి కాలేజీలో బి.టెక్ విద్యార్థి గుండు భరద్వాజ, యాకారా గణేష్, వాగ్‌దేవి ఇంక్యుబేషన్ అండ్ బిజినెస్ యాక్సిలరేటర్ (విఐబిఎ) సిఇఒ డాక్టర్ ఎం.కె కౌశిక్‌తో కలిసి ఈ బొమ్మను అభివృద్ధి చేశారు.

Latest Videos

undefined

"మేము 16 దేశాల నుండి 183 ఇన్నోవేషన్స్ నుండి గెలిచాము. సెప్టెంబరులో మా బొమ్మని ప్రదర్శించే  కార్యక్రమానికి మేము హాజరు కానున్నాము. వాణిజ్య స్థాయిలో మా బొమ్మ తయారీకి ఆసక్తి ఉన్న పెట్టుబడిదారులను కలుస్తాము" అని గణేష్ అన్నారు.

బొమ్మలో సౌండ్‌వేవ్ అండ్ టచ్-బేస్డ్ కెపాసిటివ్ సెన్సార్‌తో అల్ట్రాసోనిక్ సెన్సార్ ఉందని డాక్టర్ కౌశిక్ వివరించారు. బొమ్మ చెడు స్పర్శ తగిలినపుడు శబ్దం చేస్తుంది.

బొమ్మ కోసం వార్తాపత్రికలు, టెలివిజన్ నుండి ఆలోచన వచ్చింది అని గణేష్ చెప్పారు. "మనము ప్రతిరోజూ లైంగిక వేధింపులు, అత్యాచారాల గురించి వింటున్నాము. మనము ఒక ఇన్నోవేటర్ గా సామాజిక సమస్యల గురించి ఆలోచించాలి. కాబట్టి,  మేము ఈ బొమ్మ  ఆలోచనతో వచ్చాము, దీని ద్వారా మేము పిల్లల వైఖరిని మార్చాలని అనుకుంటున్నాము.

also read వొడాఫోన్ ఐడియా త్వరలో మూతపడనుందా..? బకాయిలు, స్పెక్ట్రమ్‌ చెల్లింపులకూ కష్టాలు..

కేవలం ఆడపిల్లలకు మాత్రమే కాకుండా ఆబ్బాయిలకు కూడా అవగాహన కల్పించాలనుకుంటున్నాము. 'మంచి స్పర్శ' అలాగే 'చెడు స్పర్శ' గురించి ఇంకా అమ్మాయిలతో ఎలా ప్రవర్తించాలో అబ్బాయిలకు మేము అవగాహన కల్పించాలనుకుంటున్నాము' అని చెప్పారు.

పిల్లలలో సాంస్కృతిక, ప్రవర్తన మార్పు తీసుకురావడానికి మేము బొమ్మకు 'సంస్కర్ టాయ్' అని పేరు పెట్టామని కౌశిక్ అన్నారు. "స్కూల్స్ లో పిల్లలకు మంచి, చెడు స్పర్శ గురించి థియోరిటికల్ గా వివరించబడుతుంది. అది ఎటువంటి ప్రభావాన్ని సృష్టించదని మనందరికీ తెలుసు.

దృశ్యమాన అంశాలు విద్యార్థులపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతాయి. ఒక విద్యార్థి బొమ్మలతో ఆడుకోవచ్చు, ఇంకా ఈ మాధ్యమం ద్వారా మంచి, చెడు స్పర్శను సులభంగా అర్థం చేసుకోవచ్చు ”అని కౌశిక్ తెలిపారు.

ఈ బొమ్మ  గురించి స్పందనపై గుండు భరద్వాజ మాట్లాడుతూ మా బృందం వివిధ స్కూల్స్ లోని విద్యార్థులతో లైవ్ ఇంటరాక్షన్స్  నిర్వహించి బొమ్మ ఉపయోగాన్ని వివరించారు. "పిల్లలకు ఎడ్యుకేషన్ అందించడానికి మా బొమ్మ ఉత్తమమైన మార్గమని యాజమాన్యం తెలిపింది.

విద్యార్థులలో అవగాహన కల్పించడానికి బొమ్మలను స్కూల్స్, కాలేజీలు, అంగన్‌వాడీ వంటి విద్యా సంస్థలలో ప్రవేశపెట్టాలని వారు కోరుకుంటున్నారు" అని భరద్వాజ అన్నారు.

ఈ యంగ్ ఇన్నోవేటర్స్ వారి ఆవిష్కరణలను రిజిస్టర్ చేసుకోవడానికి అలాగే ఒక సంస్థను ప్రారంభించడానికి ప్రభుత్వ సహకారం కోసం చూస్తున్నారు.  "పోలాండ్ కి  వెళ్ళి మా ఆవిష్కరణలను ప్రపంచానికి చూపించడానికి మాకు నిధులు లేవు" అని గణేష్ అన్నారు.

click me!