వివో ఇండియా మరో స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో రిలీజ్ చేసింది. వివో వై21ఏ మోడల్‌ను పరిచయం చేసింది. 2020 డిసెంబర్‌లో వివో వై20ఏ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ స్మార్ట్‌ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేస్తూ లేటెస్ట్‌గా వివో వై21ఏ మోడల్‌ను రిలీజ్ చేసింది.
వివో ఇండియా మరో స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో రిలీజ్ చేసింది. వివోవై21ఏ మోడల్‌ను పరిచయం చేసింది. 2020 డిసెంబర్‌లో వివో వై20ఏ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ స్మార్ట్‌ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేస్తూ లేటెస్ట్‌గా వివో వై21ఏ మోడల్‌ను రిలీజ్ చేసింది. ఇందులో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 13 మెగాపిక్సెల్ కెమెరా సెటప్, మీడియా టెక్ హీలియో పీ22 ప్రాసెసర్ లాంటి ప్రత్యేకతలున్నాయి. ఈ ప్రాసెసర్‌తో ఇండియాలో టెక్నో పోవా నియో, నోకియా జీ10, టెక్నో స్పార్క్ 8, మోటో ఈ7 పవర్ లాంటి మోడల్స్ ఉన్నాయి. వివో వై21ఏ ధర ఎంతో తెలియదు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసిన కంపెనీ.. ధరను వెల్లడించలేదు. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో వివో వై21ఏ రిలీజైంది. ఈ స్మార్ట్‌ఫోన్ రూ.10,000పైనే ఉండొచ్చని అంచనా.
వివో వై21ఏ స్మార్ట్‌ఫోన్ సేల్ ఎప్పుడు ప్రారంభం అవుతుందన్న వివరాలు కూడా ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఇ-కామర్స్ వెబ్‌సైట్లతో పాటు ఆఫ్‌లైన్ రీటైల్ స్టోర్లలో వివో వై21ఏ స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు. ఈ ఫోన్ రెండు వెరియంట్‌లలో మిడ్‌నైట్ బ్లూ, డైమండ్ గ్లో కలర్స్‌లో లభిస్తుంది. రూ.10,000లోపు ఈ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయితే ఇప్పటికే ఈ బడ్జెట్‌లో ఉన్న పోకో సీ31, పోకో ఎం2 రీలోడెడ్, మోటోరోలో ఈ40, సాంసంగ్ గెలాక్సీ ఎం12, సాంసంగ్ గెలాక్సీ ఎఫ్12 లాంటి మోడల్స్‌కు గట్టి పోటీ ఇవ్వొచ్చు.
వివో వై21ఏ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 6.51 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ హీలియో పీ22 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో లభిస్తుంది. వివో ఎక్స్‌ప్యాండింగ్ ర్యామ్ ఫీచర్‌తో 1జీబీ వరకు ర్యామ్ పెంచుకవోచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11 + ఫన్‌టచ్ ఓఎస్ 11.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. డ్యూయెల్ సిమ్ + మైక్రో ఎస్‌డీ కార్డ్ సపోర్ట్ ఉంది.
వివో వై21ఏ స్మార్ట్‌ఫోన్‌లో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరాతో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండటం విశేషం. కెమెరాలో ఫోటో, పోర్ట్‌రైట్, వీడియో, పనో, లైవ్ ఫోటో, టైమ్ ల్యాప్స్, ప్రో, డాక్ ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్స్ చూస్తే 4జీ ఎల్‌టీఈ, వైఫై, బ్లూటూత్ 5 లాంటి ఆప్షన్స్ ఉన్నాయి.