OnePlus Nord Series Phone: రూ.20 వేలలోపు ధరతో రానున్న వన్‌ప్లస్‌.. ఫీచ‌ర్లు లీక్‌..!

By team telugu  |  First Published Jan 21, 2022, 2:47 PM IST

ఫ్లాగ్‌షిప్‌ రేంజ్‌లో సూపర్ సక్సెస్ అయిన వన్‌ప్లస్‌.. నార్డ్ సిరీస్‌తో ప్రీమియమ్ మిడ్ రేంజ్‌లోనూ దుమ్మురేపుతోంది. రూ.30వేలలోపు వన్‌ప్లస్‌ నార్డ్ సిరీస్ ఫోన్లు మంచి క్రేజ్ సంపాదించాయి. అయితే త్వరలోనే వన్‌ప్లస్‌ మరో ముందడుగు వేయనుంది.


ఫ్లాగ్‌షిప్‌ రేంజ్‌లో సూపర్ సక్సెస్ అయిన వన్‌ప్లస్‌.. నార్డ్ సిరీస్‌తో ప్రీమియమ్ మిడ్ రేంజ్‌లోనూ దుమ్మురేపుతోంది. రూ.30వేలలోపు వన్‌ప్లస్‌ నార్డ్ సిరీస్ ఫోన్లు మంచి క్రేజ్ సంపాదించాయి. అయితే త్వరలోనే వన్‌ప్లస్‌ మరో ముందడుగు వేయనుంది. రూ.20వేలలోపే ఓ నార్డ్ స్మార్ట్‌ఫోన్‌ తీసుకురానుంది. ఎంతో డిమాండ్ ఉన్న బడ్జెట్ రేంజ్‌లో ఈ ఫోన్‌ను తీసుకొచ్చి మార్కెట్ ను పెంచుకునేందుకు ప్లాన్‌ చేస్తోంది. 5జీ కనెక్టివిటీతో ఈ తక్కువ ధర మొబైల్‌ లాంచ్ చేయనుంది. ఈ రూ.20వేలలోపు ధరతో రానున్న వన్‌ప్లస్‌ నార్డ్ ఫోన్‌ స్పెసిఫికేషన్లు లీకయ్యాయి.

రూ.20వేలలోపు సెగ్మెంట్ లో నార్డ్ ఫోన్‌ను వన్‌ప్లస్‌ తీసుకురానుందని టిప్ స్టర్ యోగేశ్ బ్రార్ కూడా వెల్లడించారు. ఈ ఏడాది జూలై తర్వాత ఇది భారత మార్కెట్లోకి వస్తుందని అంచనా వేశారు. ప్రస్తుతం OnePlus ఫోన్‌లన్నీ రూ.20వేల కంటే ఎక్కువ ధరతోనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ చౌకైన వన్‌ప్లస్‌ నార్డ్ మొబైల్‌ తయారీ ప్రారంభ దశలో ఉంది. అయితే ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్లు బయటికి వచ్చాయి. ముఖ్యంగా 90హెట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండే అమోలెడ్ డిస్‌ప్లేతో ఈ స్మార్ట్‌ఫోన్‌ రానుంది. అలాగే 5జీ కనెక్టివిటీ, మీడియాటెక్ ప్రాసెసర్‌తో వస్తుంది. మరోవైపు ఈ వన్‌ప్లస్‌ తక్కువ ధర ఫోన్‌ వెనుక 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో రానుందని సమాచారం. ఇక మిగిలిన విషయాలపై స్పష్టత రాలేదు. వన్‌ప్లస్‌ నార్డ్ ఫోన్‌ రూ.20వేలలోపు విభాగంలో విడుదలైతే రియల్‌మీ, షియోమీ, సామ్‌సంగ్‌, ఒప్పో, వివో మొబైళ్లకు తీవ్ర పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.

Latest Videos

వ‌న్‌ప్లస్‌ నార్డ్ 3 విడుదలైన తర్వాత ఈ చౌక వన్‌ప్లస్‌ మొబైల్‌ రానుంది. రెండో త్రైమాసికంలో విడుదలవుతుంది. మరోవైపు త్వరలోనే వన్‌ప్లస్‌ 2 సీఈ ఫోన్‌ కూడా లాంచ్ కానుంది. ఇటీవల భారత్‌లో వన్‌ప్లస్‌ 9ఆర్టీ మొబైల్‌ లాంచ్ అయింది. రూ.40వేలలోపు ధరలో ఫ్లాగ్‌షిప్‌ స్పెసిఫికేషన్లతో ఈ ఫోన్‌ వచ్చింది. అలాగే చైనాలో ఈ నెలలోనే వన్‌ప్లస్‌ 10 ప్రో లాంచ్ అయింది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌తో వచ్చిన ఈ ఫోన్‌ కూడా త్వరలో భారత్‌కు రానుంది. మొత్తంగా 2022లో దూకుడును మరింత పెంచనుంది వన్‌ప్లస్‌. అన్ని విభాగాల్లో ఫోన్లను లాంచ్ చేసి మార్కెట్ ను పెంచుకునేందుకు మాస్టర్ ప్లాన్‌ వేసింది వ‌న్ ప్ల‌స్‌.

click me!