Xiaomi MIX 5 and Vivo NEX 5: 2022లో బెస్ట్ కెమెరా ఫోన్స్

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 21, 2022, 11:17 AM IST
Xiaomi MIX 5 and Vivo NEX 5: 2022లో బెస్ట్ కెమెరా ఫోన్స్

సారాంశం

ప్రస్తుతం తక్కువ బడ్జెట్‌లో కూడా చాలా స్మార్ట్‌ ఫోన్లు టాప్ ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్‌లతో వస్తున్నాయి. దీంతో ఈ ఏడాది.. గతేడాది మాదిరిగా స్మార్ట్‌ ఫోన్స్‌ (Smart phones) మధ్య ఫ్లాగ్‌షిప్ (Flagship) విషయంలో పెద్దగా పోటీ ఉండదు. 

ప్రస్తుతం తక్కువ బడ్జెట్‌లో కూడా చాలా స్మార్ట్‌ ఫోన్లు టాప్ ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్‌లతో వస్తున్నాయి. దీంతో ఈ ఏడాది.. గతేడాది మాదిరిగా స్మార్ట్‌ ఫోన్స్‌ (Smart phones) మధ్య ఫ్లాగ్‌షిప్ (Flagship) విషయంలో పెద్దగా పోటీ ఉండదు. షావోమి (Xiaomi) రెడ్‌మీ కే40 (Redmi K40) సిరీస్‌ను క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగ్‌ 870 (Qualcomm Snapdragon 870), స్నాప్‌డ్రాగ్‌ 888 (Snapdragon 888) ప్రాసెసర్‌లతో మార్కెట్‌లోకి వదిలింది. 

అలాగే రియల్‌మి (Realme) రియల్‌మి జీటీని (Realme GT) స్నాప్‌డ్రాగన్ 888తో, రియల్‌మి జీటీ 2 ప్రోను స్నాప్‌డ్రాగన్ 8 జెన్‌ 1తో లాంచ్ చేసింది. ఇలా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లు (Smart phones) మార్కెట్‌లోకి చాలానే వచ్చాయి. దీంతో ప్రస్తుతం చాలా స్మార్ట్‌ఫోన్ల కంపెనీలు ఫోటో (Photo) వీడియో నాణ్యతపై ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి.

షావోమి (Xiaomi), వీవో (Vivo) కంపెనీలు తమ స్మార్ట్‌ఫోన్లు అయిన Xiaomi Mi 11 Ultra, Vivo X70 Pro ప్లస్‌లలో ఎక్కువ క్వాలిటీ ఉన్న కెమెరాలను ఇచ్చాయి. ఇక 2022లో చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలు (Smartphone companies) షావోమి (Xiaomi), వీవో (Vivo) కంపెనీలు ఎక్స్‌లెంట్‌ ఫోటోగ్రఫీ తీసే విధంగా ఉండే కెమెరా ఫోన్స్‌ను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. దీంతో షావోమి, వీవోలు మరోసారి ట్రెండ్‌సెట్టర్‌గా మారబోతున్నాయి. షావోమి మిక్స్‌ 5 (Xiaomi MIX 5) అలాగే వీవో నెక్స్‌ 5 (Vivo NEX 5) స్మార్ట్‌ ఫోన్స్‌ అదిరిపోయే కెమెరా క్వాలిటీతో రానున్నాయి. 2022లో బెస్ట్ కెమెరా ఫోన్స్‌గా (Best Camera Phones‌) ఇవి నిలవనున్నాయి. 

ఈ రెండు స్మార్ట్‌ ఫోన్లలో కెమెరా ఫీచర్స్‌ కూడా చాలా ఉండనున్నాయి. అల్ట్రా-వైడ్, నార్మల్, టెలిఫోటో లెన్స్‌తో ఫోటో, వీడియో తీసే సమయంలో లైటింగ్‌ తక్కువగా ఉన్నా కూడా క్వాలిటీ మాత్రం ఏమాత్రం తగ్గదు. ఇక తమ ఫోన్లలో మంచి క్వాలిటీ ఉన్న కెమెరాలను (Quality camera) ఇచ్చేందుకు.. షావోమి (Xiaomi) లైకాతో, వీవీ (Vivo) జైస్‌ వంటి హై ప్రొఫైల్ కెమెరా దిగ్గజాలతో క‌లవ‌నున్నట్లు సమాచారం.


 

PREV
click me!

Recommended Stories

iPhone : ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 17 ప్రో, 15 ప్లస్‌పై భారీ తగ్గింపులు !
WhatsApp Tips : మీ నెంబర్ ను ఎవరైనా బ్లాక్ చేశారా..? Meta AI సాయంతో ఈజీగా తెలుసుకోండిలా