ఆగస్టు 15 స్పెషల్.. వివో స్మార్ట్ ఫోన్ పై భారీ ఆఫర్లు

First Published 6, Aug 2018, 4:33 PM IST
Highlights

రూ.44వేలు విలువచేసే స్మార్ట్ ఫోన్ ని రూ.1947కే అందజేస్తున్నట్లు వివో ప్రకటించింది.

ప్రముఖ మొబైల్ ఫోన్స్ తయారీ సంస్థ వివో.. తన కంపెనీ స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు ప్రకటించింది. ఆగస్టు15 పురస్కరించుకొని ఈ డీల్ ని ప్రవేశపెట్టింది. 72 గంటల పాటు అద్భుతమైన ఆఫర్లతో.. వివో ఫ్రీడం కార్నివల్‌ ఆన్‌లైన్‌ సేల్‌ను నిర్వహించనున్నట్టు వెల్లడించింది. వివో ప్రకటించిన ఈ సేల్‌లో.. ఇప్పటికే మంచి రివ్యూను సంపాదించుకున్న వివో నెక్స్‌ స్మార్ట్‌ఫోన్‌ కేవలం 1947 రూపాయలకే అందుబాటులోకి వస్తోంది. 

అసలు వివో నెక్స్‌ ధర 44,990 రూపాయలు. వివో నెక్స్‌తో పాటు వివో వీ9 కూడా 1947 రూపాయలకే విక్రయానికి రానుంది. దీని ధర 22,990 రూపాయలు. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లను ఫ్లాష్‌ సేల్‌కు తెచ్చి, పరిమితి సంఖ్యలో వీటిని వివో ఆఫర్‌ చేయబోతుంది. వివో నిర్వహించే ఫ్రీడం కార్నివల్‌లో ఈ రెండు స్మార్ట్‌ఫోన్ల ఫ్లాష్‌ సేల్‌ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. స్టాక్‌ అయిపోయేంత వరకు రూ.1947కే ఈ స్మార్ట్‌ఫోన్లను విక్రయించనుంది. 

ఈ కార్నివాల్ ఈరోజు రాత్రి ( ఆగస్టు6) ప్రారంభమై.. ఆగస్టు 9వ తేదీన ముగుస్తుంది. ఈ సేల్‌ కేవలం కంపెనీ ఆన్‌లైన్‌ పోర్టల్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ మూడు రోజుల సేల్‌లో భాగంగా అన్ని డెబిట్‌, క్రెడిట్‌ కార్డులపై ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్లపై రూ.4000 వరకు క్యాష్‌బ్యాక్‌, 12 నెలల జీరో కాస్ట్‌ ఈఎంఐ, 1200 రూపాయల విలువైన ఉచిత బ్లూటూత్‌ ఇయర్‌ ఫోన్స్‌ అందుబాటులో ఉంటాయి. యూఎస్‌బీ ఛార్జింగ్‌ కేబుల్స్‌ను కేవలం 72 రూపాయలకే అదనపు క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లతో విక్రయిస్తోంది. 72వ స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో, యాక్ససరీస్‌ ధరలను కూడా 72 రూపాయలుగానే నిర్ణయించింది. 

Last Updated 6, Aug 2018, 4:33 PM IST