Vivo Holi Offer: వివో స్పెషల్ ఆఫర్స్.. కస్టమర్లకు గొప్ప అవకాశం..!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Mar 15, 2022, 04:16 PM IST
Vivo Holi Offer: వివో స్పెషల్ ఆఫర్స్..  కస్టమర్లకు గొప్ప అవకాశం..!

సారాంశం

హోలీ సందర్భంగా తమ స్మార్ట్ ఫోన్స్ పై స్పెషల్ ఆఫర్స్ ను ప్రవేశపెడుతున్నట్లు Vivo India ఓ ప్రకటన చేసింది. ఈ ఆఫర్ ద్వారా Vivo V23 సిరీస్ లపై భారీ తగ్గింపును కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. 

హోలీ పండుగ సంబరాలకు ప్రజలందరూ సిద్ధమయ్యారు. ఈ రంగుల పండుగను మరింత ప్రత్యేకంగా మార్చేందుకు Vivo స్మార్ట్ ఫోన్ కంపెనీ హోలీ స్పెషల్ ఆఫర్‌ను ప్రకటించింది. Vivo ఇండియా ప్రవేశపెట్టిన ఈ ఆఫర్ ద్వారా.. Vivo V23 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను చాలా తక్కువ ధరలకు కొనుగోలు చేయవచ్చు. ఊసరవెల్లిలా రంగులు మార్చే Vivo V23 సిరీస్‌ని కొనుగోలు చేయడానికి కస్టమర్లకు ఇదో గొప్ప అవకాశం. అయితే హోలీ స్పెషల్ ఆఫర్ కింద ఏఏ స్మార్ట్ ఫోన్స్ పై ఆఫర్ ఉందో తెలుసుకుందాం..! 

హోలీ సందర్భంగా వివో స్మార్ట్ ఫోన్ కంపెనీ కస్టమర్ల కోసం ఓ ప్రత్యేక ఆఫర్ ను ప్రకటించింది. అందులో భాగంగా లగ్జరీ స్మార్ట్‌ఫోన్‌లు Vivo V23, V23 ప్రో వేరియంట్లపై ఆకర్షణీయమైన క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదో గొప్ప అవకాశం. మార్చి 31 వరకు మీరు ఈ ఆఫర్ ను పొందవచ్చు. ఈ ఆఫర్ ను పొందేందుకు దగ్గర‌లోని వివో రిటైల్ స్టోర్ కు వెళ్లాల్సి ఉంటుంది. 

Vivo హోలీ క్యాష్‌బ్యాక్ ఆఫర్

Vivo హోలీ ఆఫర్ లో భాగంగా Vivo V23 5G, Vivo V23 Pro 5G, Vivo V23e 5G స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ వేరియంట్స్ కొనుగోలు పై ICICI, Kotak, IDFC ఫస్ట్ బ్యాంకు కార్డును ఉపయోగించడం వల్ల రూ. 3,500 క్యాష్ బ్యాక్ లభిస్తుంది. దీంతో పాటు స్మార్ట్‌ఫోన్ ఒక సంవత్సరం వారంటీ, వన్-టైమ్ ఫ్రీ స్క్రీన్ రీప్లేస్‌మెంట్ ఆఫర్‌తో కూడా వస్తుంది.

Vivo V23 సిరీస్ ధరలు

Vivo V23 8GB + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.  29,990 ఉండగా.. 12GB + 256GB స్టోరేజ్ మోడల్ రూ. 34,990 ధరకు విక్రయిస్తున్నారు. Vivo V23 Pro 5G 8GB + 128GB మోడల్ ధర రూ. 38,990 కాగా.. 12GB + 256GB మోడల్ ధర రూ. 43,990 గా ఉంది. దీని 12GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 43,990కి అందుబాటులో ఉంది. అదే సమయంలో Vivo V23e 5G 8GB + 128GB మోడల్ ధర రూ. 25,990కు విక్రయిస్తోంది వివో ఇండియా సంస్థ.   

PREV
click me!

Recommended Stories

iPhone : ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 17 ప్రో, 15 ప్లస్‌పై భారీ తగ్గింపులు !
WhatsApp Tips : మీ నెంబర్ ను ఎవరైనా బ్లాక్ చేశారా..? Meta AI సాయంతో ఈజీగా తెలుసుకోండిలా