apple ios update:ఇప్పుడు మీరు ఫేస్ మాస్క్‌తో కూడా ఐఫోన్ ని అన్‌లాక్ చేయవచ్చు, ఈ సెట్టింగ్ చేస్తే చాలు..

By asianet news telugu  |  First Published Mar 15, 2022, 2:21 PM IST

కరోనా వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుండి ఫేస్ మాస్క్ కారణంగా ఐఫోన్ వినియోగదారులు ఐఫోన్‌ను అన్‌లాక్ చేయడంలో చాలా ఇబ్బందులు ఎదురుకొంటున్నారు. అయితే ఇందుకు ఆపిల్ ఒక కొత్త అప్ డేట్ విడుదల చేసింది.
 


దాదాపు రెండు నెలల పాటు వేటింగ్ తర్వాత, ఆపిల్ ఎట్టకేలకు ఐఓఎస్ (iOS) 15.4 కోసం అప్ డేట్ విడుదల చేసింది. iOS 15.4 గత రెండు నెలలుగా బీటా వెర్షన్‌లో పరీక్షించబడుతోంది. iOS 15.4కి అప్‌డేట్ చేసిన తర్వాత మీరు మాస్క్ ధరించి ఉన్న  మీ  ఐఫోన్ (iPhone)ని అన్‌లాక్ చేయవచ్చు. కరోనా వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుండి మాస్క్ కారణంగా ఐఫోన్ వినియోగదారులు ఐఫోన్‌ను అన్‌లాక్ చేయడంలో చాలా ఇబ్బందులు ఎదురుకొంటున్నారు. ఆపిల్ సపోర్ట్ పేజీలో కొత్త అప్‌డేట్ గురించి సమాచారాన్ని కూడా ఇచ్చింది, దీనిలో ఫేస్ మాస్క్‌తో ఫేస్ ఐడిని ఎలా ఉపయోగించాలో తెలిపింది.

ఈ రెండు సిరీస్ ఐఫోన్‌లతో మాత్రమే 
ఐ‌ఓ‌ఎస్ 15.4తో ఫేస్ మాస్క్‌తో ఉన్నప్పటికి ఫేస్ ఐడిని అన్‌లాక్ చేసే ఫీచర్‌ను రూపొందించినట్లు ఆపిల్ తెలిపింది, అయితే ఈ ఫీచర్ ప్రస్తుతం ఐఫోన్ 12, ఐఫోన్ 13 సిరీస్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది, అంటే ఐఫోన్ 12, 12 ఐఫోన్ , 12 ప్రొ, 12 ప్రొ మ్యాక్స్. ఐఫోన్ 13, 13 మినీ, 13 ప్రొ, 13 ప్రొ మ్యాక్స్ తో మాత్రమే పని చేస్తుంది. ఐఫోన్ అప్‌డేట్ చేసిన తర్వాత, వినియోగదారులు ఫేస్ మాస్క్‌తో ఫేస్ ఐడిని ఉపయోగించుకునే ఆప్షన్ పొందుతారు.

Latest Videos

undefined

మాస్క్‌తో ఐఫోన్‌ను ఎలా అన్‌లాక్ చేయాలి
ఐ‌ఓ‌ఎస్ 15.4కి అప్‌డేట్ చేసిన తర్వాత, మీరు ఫోన్  వెల్ కం స్క్రీన్‌పై  ఫేస్ స్కాన్ ప్రక్రియను ఉపయోగించి ఫేస్ ఐడిని సెటప్ చేసే ఆప్షన్ పొందుతారు, ఆ తర్వాత మీరు సెట్టింగ్ చేయవచ్చు. అంతేకాకుండా, మీరు ఫోన్ సెట్టింగ్‌లలోని ఫేస్ ఐడి & పాస్‌కోడ్ సెట్టింగ్‌కి వెళ్లి ఫేస్ మాస్క్‌తో ఫేస్ ఐడిని ఆన్ చేసే ఆప్షన్ పై క్లిక్ చేయడం ద్వారా సెట్టింగ్‌ను సెట్ చేయవచ్చు.

ఐ‌ఓ‌ఎస్ 15.4 అప్‌డేట్‌తో ఈ ఫీచర్‌లు
ఐ‌ఓ‌ఎస్ 15.4తో  ఫేస్ మాస్క్‌తో పాటు, వినియోగదారులు ఎన్నో ఇతర ఫీచర్లను కూడా పొందారు. కొత్త అప్‌డేట్‌తో AirTag సెక్యూరిటీ అప్‌డేట్ అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా, ఇప్పుడు మీరు ఆఫ్‌లైన్ మోడ్‌లో కూడా  సిరిని ఉపయోగించవచ్చు.  ఇంకా ఐఫోన్ వినియోగదారులు ట్యాప్ టు పే ఫీచర్ కూడా పొందుతారు. Apple Payతో క్రెడిట్ కార్డ్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది. నోట్స్ యాప్‌లోని ఫైల్ టెక్స్ట్ డైరెక్ట్ స్కాన్ ఆప్షన్ లభిస్తుంది. వినియోగదారులు ఇప్పుడు FaceTimeలో పాటలను కూడా షేర్ చేయవచ్చు.
 

click me!