AC on Rent: అద్దెకు ఏసీలు.. కేవలం రూ. 915కే.. ఎక్క‌డో తెలుసా..?

By team telugu  |  First Published Apr 18, 2022, 10:37 AM IST

ఎండలు మండుతుండడంతో ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, ఫ్యాన్లు వంటి చల్లదనాన్ని ఇచ్చే అప్లియెన్స్‌‌లకు ఫుల్‌‌ డిమాండ్ క్రియేట్ అవుతోంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో టెంపరేచర్లు సాధారణ స్థాయికి కంటే ఎక్కువగా నమోదవుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఏసీని అద్దెకు తీసుకోవాలనుకుంటున్నట్లయితే, దేశవ్యాప్తంగా అనేక యాప్‌లు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు అద్దెకు ఎసీలను అందిస్తున్నాయి. 
 


ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వేసవి కాలంలో ఇంట్లో ఏసీ ఉంటే బాగుండు అనిపిస్తోంది. అయితే ఎసిని కొనాలంటే పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చించాల్పి ఉంటుంది. అయితే అలాంటి వారి కోసం అద్దె కంపెనీలు రెడీగా ఉన్నాయి. అందుబాటులో ఉన్న ధరలో ఏసీ(AC)లను అద్దెకు తీసుకోవడానికి అనేక యాప్‌లు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులో ఉన్నాయి. కుటుంబానికి దూరంగా ఉంటున్న బ్యాచిలర్స్, ఉద్యోగాస్ధులు ఇప్పటికే ఈ సేవలు ఉపయోగించుకుంటున్నారు. ఇన్‌స్టాలేషన్ ఖర్చు, నిర్వహణ, ఇతర సేవా ఖర్చులు అన్నీ అద్దెలోనే ఉండడంతో ఇలా ఏసీని అద్దెకు తీసుకోవడానికి వారు ఆసక్తి చూపిస్తున్నారు.

మీరు కూడా ఏసీని అద్దెకు తీసుకోవాలనుకుంటున్నట్లయితే, దేశవ్యాప్తంగా అనేక యాప్‌లు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులో ఉన్నాయి. మీరు వాటిని అద్దెను తీసుకునే ముందు సంబంధిత ప్లాట్‌ఫామ్‌ల నిబంధనలు, షరతులను అనుసరించాలి. అన్ని ప్లాట్‌ఫామ్‌లలో నియమాలు విభిన్నంగా ఉంటాయి. 

Latest Videos

undefined

రెంటోమోజో

ఫర్నిచర్ నుండి మెుదలుకుని ఎలక్ట్రిక్ వస్తువులు వరకు రెంటోమోజోలో అద్దెకు లభిస్తున్నాయి. ఈ ప్లాట్‌ఫామ్‌లు దేశంలో ఉన్న అనేక నగారాల్లో సేవలను అందిస్తున్నాయి, ఢిల్లీ, ముంబై, నోయిడా, గుర్గావ్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతాతో పాటు ఇతర నగరాల్లో ఈ యాప్ సర్వీస్ అందిస్తోంది. యాప్‌లోనే కాకుండా వెబ్‌సైట్ వెర్షన్‌లో కూడా ఈ సంస్థ సేవలు అందుబాటులో ఉన్నాయి. రెంటోమోజో యాప్ గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ రెండింటిలోనూ డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది. 

రెంటోమోజోలో AC ఛార్జీలు నెలకు రూ. 1219 నుండి మొదలవుతాయి. 2 స్టార్ 1.5 టన్ను మెషీన్‌కు నెలకు రూ. 2469 వరకు ఉంటుంది. ఈ ఛార్జీలోనే ఉచిత రీలొకేషన్, అప్‌గ్రేడ్‌లు, ఇన్‌స్టాలేషన్, మెయింటెనెన్స్ కూడా ఉంటాయి. మీరు ఏసీని అద్దెకు తీసుకున్న వ్యవధిపై ఛార్జీ ఆధారపడి ఉంటుందని గమనించాలి. అలాగే ఈ సంస్థ ప్లాట్‌ఫారమ్ సెక్యూరిటీ డిపాజిట్ మొత్తాన్ని కూడా అడుగుతుంది, ఇది మీ అద్దె వ్యవధి ముగిసిన తర్వాత తిరిగి ఇవ్వబడుతుంది.

సిటీ ఫర్నిష్

CityFurnish కూడా ఫర్నిచర్, ఎలాక్ట్రానిక్ వస్తువులను అందుబాటు ధరలో అద్దెకు ఇస్తుంది. ఈ ప్లాట్‌ఫామ్ ఢిల్లీ, నోయిడా, గుర్గావ్, హైదరాబాద్, ముంబై, బెంగళూరుతో సహా అనేక ప్రధాన నగరాలకు సేవలు అందిస్తుంది. ఈ ప్లాట్‌ఫామ్‌కు అధిక డిమాండ్ ఉన్న కారణంగా ఎసీలకు నెలకు రూ. 1569 వరకు అద్దె ఉంది. ముందుగా సెక్యూరిటీ డిపాజిట్ కూడా చెల్లించాల్సి ఉంటుంది, ఇది మీ అద్దె వ్యవధి ముగిసిన తర్వాత తిరిగి ఇవ్వబడుతుంది. ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాలేషన్ కోసం అదనపు ఛార్జీలు వసూలు చేస్తుంది.

ఫెయిర్ రెంట్

ఎయిర్ కండీషనర్లను అద్దెకు తీసుకోవడానికి ఫెయిర్ రెంట్ లో అనేక ఆప్షన్స్ ఉన్నాయి. విండో ACల నుండి వివిధ సామర్థ్యాలతో కూడిన స్ప్లిట్ ACలను ఈ ప్లాట్‌ఫారమ్ అందిస్తుంది. ప్లాట్‌ఫామ్‌పై ఛార్జీలను చూస్తే 0.75 టన్ను విండో ACకి నెలకు రూ. 915 నుండి ప్రారంభమవుతాయి. టన్ను స్ప్లిట్ ఏసీకి రూ. 1375 వరకు ఉంది. ఈ సంస్థ ఉచిత ఇన్‌స్టాలేషన్ రుసుములను అందిస్తుంది. మెషిన్‌కు అదనపు ఛార్జీ లేకుండా స్టెబిలైజర్‌తో వస్తుంది. అద్దెలో ఉచిత నిర్వహణతో పాటు మరిన్ని సౌకర్యాలు ఉంటాయి.

click me!