ట్విట్టర్ సంచలన నిర్ణయం.. నేడు ఉద్యోగాల కొతతో పాటు తాత్కాలికంగా ఆఫీసుల మూసివేత..

By asianet news telugu  |  First Published Nov 4, 2022, 10:55 AM IST

ట్విట్టర్‌లో ఉద్యోగుల తొలగింపు ఈ రోజు అంటే నవంబర్ 4న మధ్యనం 12 గంటలకు ఈ మెయిల్ ద్వారా తెలియజేయనుంది. అయితే ఎలోన్ మస్క్ కంపెనీ మౌలిక సదుపాయాల ఖర్చులను తగ్గించడం ద్వారా సుమారు $ 82 బిలియన్లను ఆదా చేయాలనుకుంటున్నారట. 


గత రెండు వారాలుగా ట్విట్టర్ ఆఫీస్‌లో చాలా మార్పులు జరుగుతున్నాయి. టెస్లా అధినేత, బిలియనీర్ ఎలోన్ మస్క్ ట్విట్టర్ కొత్త బాస్ అయిన వెంటనే సి‌ఈ‌ఓ పరాగ్ అగర్వాల్‌తో సహా చాలా మంది పెద్ద  అధికారులను తొలగించారు అయితే అప్పటి నుండి తొలగింపులు కొనసాగుతున్నాయి. మరోవైపు ట్విటర్‌ డౌన్‌ అయిందనే వార్తలు కూడా వస్తున్నాయి. నవంబర్ 04 అంటే ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల నుండి యూజర్లు సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.

DownDetector ప్రకారం, ఇప్పటివరకు సుమారు 200 మంది ట్విట్టర్ డౌన్ ని నివేదించారు. చాలా మంది యూజర్లు ట్విట్టర్ వెబ్‌సైట్‌తో సమస్యలను ఎదుర్కొంటున్నట్లు ట్వీట్స్ చేశారు. అయితే యూజర్లందరికి ట్విట్టర్‌తో సమస్యలు లేకపోయినా, కేవలం 6 శాతం మంది మాత్రమే ట్విట్టర్ యాప్‌పై ఫిర్యాదు చేశారు. కొంతమంది యూజర్లు మాత్రమే లాగిన్ గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ట్విట్టర్ వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయడం ద్వారా యూజర్లు  సంథింగ్ వెంట్ వ్రాంగ్  అనే మెసేజ్ అందుకుంటున్నారు.

Latest Videos

undefined

భారీ తొలగింపులు
ఎలాన్ మస్క్ ట్విట్టర్ యజమాని అయిన తర్వాత ట్విట్టర్ భారీ తొలగింపులను ఎదుర్కొంటోంది. ఎలోన్ మస్క్ ఆధ్వర్యంలో కంపెనీ భవిష్యత్తు గురించి  అనిశ్చితి నెలకొన్నందున ఉద్యోగుల తొలగింపు, తాత్కాలికంగా ఆఫీసుల మూసివేత, సిబ్బంది యాక్సె వంటి వాటి గురించి ట్విట్టర్ శుక్రవారం ఇమెయిల్ ద్వారా ఉద్యోగులకు తెలియజేయనుంది.

 ట్విట్టర్‌లో ఉద్యోగుల తొలగింపు ఈ రోజు అంటే నవంబర్ 4న మధ్యనం 12 గంటలకు ఈ మెయిల్ ద్వారా తెలియజేయనుంది. అయితే ఎలోన్ మస్క్ కంపెనీ మౌలిక సదుపాయాల ఖర్చులను తగ్గించడం ద్వారా సుమారు $ 82 బిలియన్లను ఆదా చేయాలనుకుంటున్నారట. 

"ట్విటర్‌ను ఆరోగ్యకరమైన మార్గంలో ఉంచే ప్రయత్నంలో శుక్రవారం మా గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌ను తగ్గించే ప్రక్రియ ఉంటుంది" అని ఒక ఇమెయిల్ లో  పేర్కొంది.

"ప్రతి ఉద్యోగి భద్రతతో పాటు ట్విట్టర్ సిస్టమ్‌లు అండ్ కస్టమర్ డేటాను నిర్ధారించడంలో సహాయపడటానికి" ఆఫీసులు తాత్కాలికంగా మూసివేయబడతాయి అలాగే  యాక్సెస్ నిలిపివేయబడుతుందని ట్విట్టర్ తెలిపింది.

ఉద్యోగాల తొలగింపుల వల్ల ప్రభావితం కాని ట్విట్టర్ ఉద్యోగులకు వర్క్ ఇమెయిల్ అడ్రస్ ద్వారా తెలియజేయబడుతుందని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ తెలిపింది. తొలగించిన సిబ్బందికి వారి పర్సనల్ ఇమెయిల్ అడ్రస్ కి తెలియజేయబడుతుందని మెమోలో పేర్కొంది.

ఒక నివేదిక ప్రకారం, మౌలిక సదుపాయాల వ్యయాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ఎలోన్ మస్క్ Twitter Inc. కొత్త నిర్వాహకులను కోరారు. ట్విటర్‌ ఖర్చును ఏడాదికి 1 బిలియన్ డాలర్ల మేర తగ్గించుకోవాలని ఆయన అన్నారు. ఖర్చు తగ్గించుకోవడానికి ఎలోన్ మస్క్ ఈ ప్లాన్‌కి 'డీప్ కట్స్ ప్లాన్' అని పేరు కూడా పెట్టారు. 

ఖర్చు తగ్గింపు ప్రణాళికతో తెలిసిన సమాచారం ప్రకారం, సర్వర్ అండ్ క్లౌడ్ సేవల నుండి రోజుకు $1.5 మిలియన్ నుండి $3 మిలియన్ల మధ్య ఆదా చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుందని ట్విట్టర్ ఇంటర్నల్ వర్గం తెలిపింది. ఇంటర్నల్ డాక్యుమెంట్స్ ప్రకారం, ట్విట్టర్ ప్రస్తుతం రోజుకు 3 మిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూస్తోంది. అయితే ఈ ప్లాన్‌కు సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. 

click me!