నెట్‌వర్క్ వెరిఫికేషన్, క్వాలిటీ అండ్ పర్ఫర్మెంస్ కోసం టెస్టింగ్ పూర్తయిన వెంటనే ఐఫోన్ యూజర్లకు బెస్ట్ 5జి అనుభవాన్ని అందించడానికి భారతదేశంలోని భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నట్లు ఆపిల్ కంపెనీ తెలిపింది.
ఆపిల్ ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్. నవంబర్ 7 నుంచి ఆపిల్ ఐఫోన్ లో 5జి సర్వీస్ అందుబాటులోకి రానుంది. ఐఫోన్ యూజర్లు iOS 16 బీటా సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్ ద్వారా 5జి సదుపాయాన్ని పొందుతారు. టెలికాం మంత్రిత్వ శాఖ ప్రకారం, 5G సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా ఎనేబుల్ చేయనడుతుంది. అలాగే డిసెంబర్‌లో అన్ని ఐఫోన్‌లకు అందుబాటులో ఉంటుంది.
నెట్‌వర్క్ వెరిఫికేషన్, క్వాలిటీ అండ్ పర్ఫర్మెంస్ కోసం టెస్టింగ్ పూర్తయిన వెంటనే ఐఫోన్ యూజర్లకు బెస్ట్ 5G అనుభవాన్ని అందించడానికి భారతదేశంలోని భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అక్టోబర్ 1న 5జీ సేవలను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే ఆపిల్ యూజర్లకు మెరుగైన సేవలను అందించడానికి వారి సూచనలను కూడా కోరింది.
బీటా సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌లో పాల్గొనే ఎయిర్ టెల్ అండ్ జియో కస్టమర్‌లు అప్‌డేట్ తర్వాత 5జిని ప్రయత్నించవచ్చు. iPhone-14, iPhone-13, iPhone-12 ఇంకా iPhone SE (3వ జనరేషన్) మోడల్‌లను ఉపయోగించే యూజర్లు 5G కోసం బీటా సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌ను యాక్సెస్ చేయవచ్చు.