రిలయన్స్ జియో ట్రూ 5జి.. అన్నీ జిల్లాల్లో కవరేజ్ తో మొదటి రాష్ట్రంగా గుజరాత్.. ఖర్చు లేకుండా ఆన్ లిమిటెడ్ డేటా

By asianet news telugu  |  First Published Nov 25, 2022, 11:47 AM IST

గుజరాత్‌లోని ఈ శుభ్-ఆరంభ్ 'ఎడ్యుకేషన్-ఫర్-అల్' అనే ముఖ్యమైన ట్రు 5G-ఆధారిత చొరవతో జరుగుతుంది, ఇందులో రిలయన్స్ ఫౌండేషన్, జియో కలిసి గుజరాత్‌లోని 100 స్కూల్స్ ని మొదట డిజిటలైజ్ చేస్తున్నాయి.
 


 దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో గుజరాత్‌లోని మొత్తం 33 జిల్లాల్లో 5G సేవలను అందుబాటులోకి తెచ్చింది. దీంతో 100% డిస్ట్రిక్ట్ హెడ్‌క్వార్టర్స్‌లో జియో ట్రూ 5G కవరేజీని పొందిన మొదటి రాష్ట్రంగా గుజరాత్  అవతరించింది.

“రిలయన్స్ కి  గుజరాత్‌ జన్మభూమి కాబట్టి గుజరాత్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ ప్రకటన గుజరాత్ అలాగే గుజరాత్ ప్రజలకు అంకితం. మోడల్ రాష్ట్రంగా జియో గుజరాత్‌లో విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, పరిశ్రమ 4.0, IOT రంగాలలో ట్రూ 5G ఆధారిత కార్యక్రమాలని ప్రారంభించి, అలాగే దేశమంతటా విస్తరింపజేస్తుంది” అని జియో ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.

Latest Videos

undefined

గుజరాత్‌లోని ఈ శుభ్-ఆరంభ్ 'ఎడ్యుకేషన్-ఫర్-అల్' అనే ముఖ్యమైన ట్రు 5G-ఆధారిత చొరవతో జరుగుతుంది, ఇందులో రిలయన్స్ ఫౌండేషన్, జియో కలిసి గుజరాత్‌లోని 100 స్కూల్స్ ని మొదట డిజిటలైజ్ చేస్తున్నాయి.

1. జియో ట్రు 5G కనెక్టివిటీ 
2. అడ్వాన్స్ కంటెంట్ ప్లాట్‌ఫారమ్
3. టీచర్  & స్టూడెంట్ కొలబోరేషన్ ప్లాట్‌ఫారమ్
4. స్కూల్ మేనేజ్‌మెంట్ ప్లాట్‌ఫాం 

“మా దృఢమైన ట్రూ 5G నెట్‌వర్క్‌తో అనుసంధానించబడిన 100% డిస్ట్రిక్ట్ హెడ్‌క్వార్టర్స్‌  ఉన్న మొదటి రాష్ట్రంగా ఇప్పుడు గుజరాత్ అవతరించడం మాకు గర్వకారణం. ఈ టెక్నాలజి నిజమైన శక్తిని,  బిలియన్ల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో మేము ప్రదర్శించాలనుకుంటున్నాము ”అని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ చైర్మన్ ఆకాష్ ఎం అంబానీ అన్నారు.

నవంబర్ 25 అంటే నేటి నుండి గుజరాత్‌లోని జియో యూజర్లు అదనపు ఖర్చు లేకుండా 1 Gbps+ స్పీడ్ తో ఆన్ లిమిటెడ్ డేటాను ఆస్వాదించడానికి Jio వెల్‌కమ్ ఆఫర్‌కి ఆహ్వానించబడతారు.


 

రిలయన్స్ జియో ట్రూ 5జి.. అన్నీ జిల్లాల్లో కవరేజ్ తో మొదటి రాష్ట్రంగా గుజరాత్.. pic.twitter.com/QzWmSG01de

— Asianetnews Telugu (@AsianetNewsTL)
click me!