మైక్రో బ్లాగింగ్ ఫ్లాట్ ఫార్మ్ ట్విట్టర్ ఇండియాతో సహ ఇతర దేశాలలో నిలిచిపోయింది. శుక్రవారం రాత్రి నుండి సుమారు 40వేల మంది యూజర్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌తో సమస్యలను ఎదురుకొంటున్నట్లు కొన్ని నివేదికలు తెలిపాయి.
భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక దేశాలలో ట్విట్టర్ నిలిచిపోయింది. యూజర్లు ట్విట్టర్ లో ట్వీట్ చేయడంతో పాటు లాగిన్ అవడంలో సమస్యలను ఎరురుకొంటునట్లు పేర్కొన్నారు.
వేలాది మంది ట్విట్టర్ యూజర్లు ట్వీట్ సమస్యలను నివేదించిన తరువాత ఈ సమస్యను పరిష్కరించే పనిలో ఉన్నట్లు ట్విట్టర్ ట్వీట్ తెలిపింది. “మీలో కొంతమందికి ట్వీట్లు లోడ్ కాకపోవచ్చు. మేము సమస్యను పరిష్కరించే పనిలో ఉన్నాము. త్వరలో మీ టైమ్‌లైన్‌కు తిరిగి అఓ డేట్ అవుతుంది ”అని కంపెనీ ఈ రోజు ఉదయం 6.21AM పోస్ట్ చేసిన ట్వీట్‌లో తెలిపింది.
undefined
Tweets may not be loading for some of you. We’re working on fixing a problem and you’ll be back on the timeline soon.
— Twitter Support (@TwitterSupport)ట్విట్టర్ డౌన్ ని డౌన్‌డిటర్ ధృవీకరించింది. డౌన్‌డిటర్ ప్రకారం ఏప్రిల్ 17న ఉదయం 6 గంటలకు ట్విట్టర్ పడిపోయింది, తరువాత మధ్యాహ్నం 12 గంటలకు మళ్లీ నిలిచిపోయింది. డౌన్‌డిటర్‌లో 19 శాతం మంది ట్వీట్ చేయడం లో సమస్యలు ఎదురుకొంటున్నట్లు ఫిర్యాదు చేశారు.
also read జియో దెబ్బకు టెలికాం ఆపరేటర్ల సంఖ్య 12 నుంచి 3కి పడిపోయింది: సునీల్ మిట్టల్ ...
శుక్రవారం రాత్రి సుమారు 40వేల మంది యూజర్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌తో సమస్యలను నివేదించారని అవుటేజ్ మానిటరింగ్ వెబ్‌సైట్ డౌన్‌డెటెక్టర్.కామ్ తెలిపింది.
డౌన్‌డెటెక్టర్ ప్లాట్‌ఫారమ్‌లో వినియోగదారు సమర్పించిన లోపాలతో సహా, కొన్ని సోర్సెస్ స్టేటస్ రేపోర్ట్స్ ద్వారా డౌన్‌డెటెక్టర్ ఈ అంతరాయాలను ట్రాక్ చేస్తుంది. అయితే అంతరాయం పెద్ద సంఖ్యలో వినియోగదారులను ప్రభావితం చేస్తున్నట్లు తెలుస్తుంది.
డౌన్‌డెక్టర్ వెబ్‌సైట్ ప్రకారం చాలా మంది ట్విట్టర్ యూజర్లు నేడు ఉదయం 5:30AM ముందు నుండి ఆ సమస్యలను నివేదించడం ప్రారంభించారు. ట్విట్టర్ పనిచేయడం లేదని ఫిర్యాదు చేసిన వారిలో 40వేల మందికి పైగా ఉన్నారని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి.