DND యాప్‌ను మెరుగుపరచడానికి TRAI ఏజెన్సీలతో కలిసి పనిచేస్తోందని రఘునందన్ చెప్పారు. ఆండ్రాయిడ్ వినియోగదారుల సమస్యలన్నీ పరిష్కారమయ్యాయని, ఐఓఎస్‌లో కొంత సమస్య ఉందని వాటిని కూడా పరిష్కరించే పని జరుగుతోందని చెప్పారు.
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) యాప్ డూ నాట్ డిస్టర్బ్ (DND) గురించి మీరు తప్పనిసరిగా తెలుసుకోవాలి. తెలియని ఇంకా విసిగించే కాల్స్ ని నిరోధించడానికి ఈ యాప్ ప్రత్యేకంగా రూపొందించబడింది. కాలానుగుణంగా ఈ యాప్‌లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే DND యాప్ ఒక బగ్ వినియోగదారులను చాలా ఇబ్బంది పెట్టింది కానీ ఇప్పుడు ఆలా జరగదు.
TRAI సెక్రటరీ వి రఘునందన్ ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ DND యాప్‌లోని లోపాలను పరిష్కరించడానికి తాము ఆక్టీవ్ గా పనిచేస్తున్నామని చెప్పారు. TRAI ఈ DND యాప్‌ను మెరుగుపరచడానికి నిరంతర కృషి జరుగుతోందని రఘునందన్ హామీ ఇచ్చారు.
undefined
ప్రస్తుతం డీఎన్‌డీ యాప్ సజావుగా పనిచేసేలా చూడడమే ట్రాయ్ లక్ష్యం అని ఆయన అన్నారు. త్వరలో వినియోగదారులు గొప్ప DND యాప్‌ని పొందుతారు, దీని ద్వారా వారు తెలియని ఇంకా విసిగించే కాల్స్ అండ్ మెసేజెస్ బ్లాక్ చేయగలరు.
DND యాప్‌ను మెరుగుపరచడానికి TRAI ఎక్స్టీరియర్ ఏజెన్సీలతో కలిసి పనిచేస్తోందని రఘునందన్ చెప్పారు. ఆండ్రాయిడ్ వినియోగదారుల సమస్యలన్నీ పరిష్కారమయ్యాయని, ఐఓఎస్‌లో కొంత సమస్య ఉందని, వాటిని పరిష్కరించే పని జరుగుతోందని చెప్పారు. మార్చి 2024 నాటికి DND యాప్ పూర్తిగా అందుబాటులోకి వస్తుంది. ఒక నివేదిక ప్రకారం, దేశవ్యాప్తంగా ప్రతిరోజూ దాదాపు 50 లక్షల స్పామ్ కాల్స్ వస్తున్నాయి.
TRAI DND యాప్‌ని ఎలా ఉపయోగించాలి?
1.మీకు ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే, Google Play Store నుండి TRAI DND 3.0 యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి.
2.యాప్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, OTP ద్వారా లాగిన్ చేయండి.
3.లాగిన్ అయిన తర్వాత, DND యాప్ మీ నంబర్‌పై పని చేయడం ప్రారంభిస్తుంది.
4.దీని తర్వాత, తెలియని ఇంకా విసిగించే, ఆవాంఛిత కాల్స్ అండ్ మెసేజెస్ బ్లాక్ చేయబడతాయి.
5.ఈ యాప్ సహాయంతో మీరు ఏదైనా కాల్ లేదా ఏదైనా నంబర్ గురించి ఫిర్యాదు చేయగలుగుతారు.