Google Payలో కన్వీనియన్స్ ఫీజు పేరుతో డబ్బులు ఛార్జ్ చేయడం ప్రారంభించింది. ఇప్పటి వరకు, Google Pay ద్వారా మొబైల్ రీఛార్జ్ చేయడానికి అదనంగా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు, కానీ ఇప్పుడు మీరు చెల్లించాల్సి ఉంటుంది.
భారతదేశంలోని Google Pay యూజర్లకు ఒక చేదు వార్త. గూగుల్ పే కూడా మొబైల్ రీఛార్జ్ పై ప్రత్యేక చార్జీలను వసూలు చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చాలా మంది వినియోగదారులు Google Payలో కన్వీనియన్స్ ఫీజు పేరుతో డబ్బు ఛార్జ్ చేయడం ప్రారంభించాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు, Google Pay ద్వారా మొబైల్ రీఛార్జ్ చేయడానికి ఎలాంటి అదనపు చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు, కానీ ఇప్పటి నుండి మీరు చెల్లించాల్సి ఉంటుంది.
దీనికి సంబంధించి గూగుల్ ఎటువంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు, అయితే చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు దీనిని క్లెయిమ్ చేశారు. PhonePe అండ్ Paytm ఇప్పటికే మొబైల్ రీఛార్జ్ పై అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నాయని మీకు తెలిసిందే. ఈ కంపెనీలు రీఛార్జ్ పై అదనపు ఛార్జీలు విధించడం ప్రారంభించాక Google కూడా Google Payలో మొబైల్ రీఛార్జ్ ఎప్పటికి ఉచితం అని చెప్పింది. దీని కోసం ప్రత్యేక ఛార్జీలు వసూల్ చేయదని పేర్కొంది.
పాపులర్ టిప్‌స్టర్ ముకుల్ శర్మ ట్విట్టర్‌లో ఒక స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసారు, దీనిలో జియో రూ. 749 రీఛార్జ్ పై గూగుల్ పే రూ. 752 వసూలు చేస్తోంది, ఇందులో రూ. 3 కన్వీనియన్స్ ఛార్జీగా విధించబడుతుంది. ఈ ఫెసిలిటీ ఛార్జ్ UPI అండ్ కార్డ్ పేమెంట్ మోడ్‌లో యాప్ ద్వారా చెల్లించవలసి ఉంటుంది.
నివేదిక ప్రకారం, రూ. 100 లేదా అంతకంటే తక్కువ రీఛార్జ్ పై ఎటువంటి అదనపు ఛార్జీలు ఉండవు. 200-300 వరకు రీఛార్జ్ చేయడానికి, రూ. 2 చెల్లించాలి అలాగే అధిక అమౌంట్ గల రీఛార్జ్ పై రూ. 3 మీరు కన్వీనియన్స్ ఫీజుగా చెల్లించాలి. Paytm అండ్ PhonePe కూడా ఇదే విధమైన చార్జీలు వసూలు చేస్తున్నాయి.