Timex Fit 2.0 Watch: యాపిల్ వాచ్‌ను తలపించేలా Timex Fit 2.0 స్మార్ట్‌వాచ్‌..!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Apr 07, 2022, 12:04 PM IST
Timex Fit 2.0 Watch: యాపిల్ వాచ్‌ను తలపించేలా Timex Fit 2.0 స్మార్ట్‌వాచ్‌..!

సారాంశం

ప్రముఖ గడియారాల తయారీదారు టైమెక్స్ నుంచి టైమెక్స్ ఫిట్ 2.0 పేరుతో సరికొత్త స్మార్ట్‌వాచ్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది అయింది. అయితే ఈ స్మార్ట్‌వాచ్ యాపిల్ వాచ్ డిజైన్ నుంచి స్ఫూర్తి పొందిన‌ట్లు తెలుస్తోంది.  


టైమెక్స్ కంపెనీ తమ బ్రాండ్ నుంచి టైమెక్స్ ఫిట్ 2.0 పేరుతో సరికొత్త స్మార్ట్‌వాచ్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త వాచ్ యాపిల్ వాచ్ డిజైన్ నుంచి స్ఫూర్తి పొందినట్లుగా చతురస్రాకార డయల్‌తో వస్తుంది. ఇప్పటికీ సాంప్రదాయ మెటల్ బకిల్ స్ట్రాప్-ఆన్ మెకానిజంను ఉపయోగిస్తోంది. ఈ వాచ్ గ్రే, బ్లూ అలాగే బ్లాక్ మూడు కలర్ ఛాయిస్ లలో లభిస్తుంది. టైమెక్స్ ఫిట్ 2.0 స్మార్ట్‌వాచ్‌లో బ్లూటూత్ కాలింగ్‌ ప్రత్యేక ఆకర్షణ. నంబర్‌ప్యాడ్, కాలింగ్ బటన్ స్క్రీన్‌పై ఇచ్చినందున నేరుగా ఈ వాచ్ నుంచే ఎవరికైనా ఫోన్ కాల్ చేయవచ్చు. ఇంకా ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి. ధర ఎంత ఉందో..? మొదలగు వివరాలను ఇక్కడ తెలుసుకుందాం..!

టైమెక్స్ ఫిట్ 2.0 స్పెసిఫికేషన్స్

టైమెక్స్ ఫిట్ 2.0 360x385 రిజల్యూషన్‌తో 1.72-అంగుళాల మెటల్ స్క్వేర్ టచ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. దీని డయల్ బ్లాక్ కలర్‌లో చూడటానికి ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇక ఇందులో హార్ట్ రేట్ మానిటరింగ్, బ్లడ్ ఆక్సిజన్ శాచురేషన్ లెవెల్ (SpO2) మానిటరింగ్, స్లీప్ ట్రాకింగ్, బ్లడ్ ప్రెజర్ ట్రాకింగ్ లాంటి సెన్సార్‌లతో పాటు ఇతర ముఖ్యమైన ఫిట్‌నెస్ ట్రాకింగ్ ఫీచర్‌లు ఉన్నాయి. ఈ టైమెక్స్ ఫిట్ 2.0 గత మోడెళ్లతో పోలిస్తే అత్యధికంగా 20 స్పోర్ట్స్ మోడ్‌లతో యాక్టివిటీ ట్రాకింగ్‌ను కూడా అందిస్తుంది. ఈ సరికొత్త స్మార్ట్‌వాచ్‌ నీరు, దుమ్ము, చెమట రెసిస్టెన్స్ కలిగి ఉంది.

ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే Timex Fit 2.0 గరిష్టంగా ఏడు రోజుల బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఇందులోని బ్లూటూత్ కనెక్టివిటీ ఫోన్ కాలింగ్ సపోర్ట్‌తో వస్తుంది. స్మార్ట్‌ఫోన్ కు కనెక్ట్ చేసుకోవడంతో పాటు స్మార్ట్ రిమోట్‌గా మ్యూజిక్ ప్లేబ్యాక్‌ని నియంత్రించడానికి ఫీచర్లు ఉన్నాయి. టైమెక్స్ ఫిట్ 2.0 ధర రూ. 5,995గా నిర్ణయించారు. అయితే ఇది అధికారిక వెబ్‌సైట్‌లో రూ. 5,515కి అందుబాటులో ఉంది.

PREV
click me!

Recommended Stories

Best Drone Cameras : ఏమిటీ..! కేవలం రూ.5,000 కే 4K డ్రోన్ కెమెరాలా..!!
Social Media Ban : ఇండియాలో సోషల్ మీడియా బ్యాన్ చేస్తారా..? ఈ కోర్టు సూచనలు ఫాలో అవుతారా..?