డిస్కౌంట్ తర్వాత, OnePlus 9 యొక్క 8GB + 128GB వేరియంట్‌ను రూ. 40,599కి మరియు 12GB + 256GB వేరియంట్‌ను రూ. 45,599కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ఆస్ట్రల్ బ్లాక్, ఆర్కిటిక్ స్కై మరియు వింటర్ మిస్ట్ రంగులలో అందుబాటులో ఉంది.
చైనీస్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ వన్ ప్లస్ (OnePlus)ఇప్పుడు భారతీయ మార్కెట్లోకి వన్ ప్లస్ 9ఆర్‌టి (OnePlus 9RT)ని చౌక ధరకు అందిస్తుంది. ఈ రెండింటికి మధ్య ఉన్న పెద్ద వ్యత్యాసం ఏమిటంటే, ఒకదానిలో హాసెల్‌బ్లాడ్ కెమెరా ఉంటుంది, మరొక దానిలో ఉండదు. వన్ ప్లస్9లో Hasselblad కెమెరా ఇచ్చారు, OnePlus 9RTలో ఈ బ్రాండ్ కెమెరా లేదు. OnePlus 10 Pro లాంచ్ తర్వాత OnePlus 9 తగ్గింపు ధరకే లభిస్తుంది. OnePlus 10 Pro భారతదేశంలో రూ. 66,999 ప్రారంభ ధరతో లాంచ్ చేశారు.
వన్ ప్లస్ 9 కొత్త ధర
డిస్కౌంట్ తో OnePlus 9 8జిబి + 128జిబి వేరియంట్‌ను రూ. 40,599కి, 12జిబి + 256జిబి వేరియంట్‌ను రూ. 45,599కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ఆస్ట్రల్ బ్లాక్, ఆర్కిటిక్ స్కై అండ్ వింటర్ మిస్ట్ కలర్స్ లో అందుబాటులో ఉంది. ఎస్‌బిఐ క్రెడిట్ కార్డ్‌తో ఫోన్ కొనుగోలుపై రూ. 5,000 అదనపు తగ్గింపు పొందవచ్చు. అంతేకాకుండా, Spotify ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ మూడు నెలల పాటు లభిస్తుంది. దీనితో రూ.4,000 ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది.
undefined
గత సంవత్సరం OnePlus 9 భారతదేశంలో ప్రారంభ ధర రూ 49,999 వద్ద ఉంది. 12 జీబీ ర్యామ్‌తో 256 జీబీ స్టోరేజ్ ధర రూ.54,999. OnePlus 9 Pro 8జిబి ర్యామ్ 128జిబి స్టోరేజ్ మోడల్ ధర రూ. 64,999, 256జిబి స్టోరేజ్‌తో 12జిబి ర్యామ్ ధర రూ. 69,999. OnePlus 9R 8జిబి ర్యామ్ 128జిబి స్టోరేజ్ మోడల్ ధర రూ. 39,999, 256జిబి స్టోరేజ్‌తో 12జిబి ర్యామ్ ధర రూ. 43,999. OnePlus వాచ్ ధర రూ. 16,999.
OnePlus 9ఆర్‌టి
OnePlus 9ఆర్‌టి ధర రెండు ర్యామ్ అండ్ స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. 8జిబి + 128జిబి వేరియంట్ ధర రూ. 42,999, 12జిబి + 1256జిబి వేరియంట్ ధర రూ. 46,999. దీనితో పాటు, SBI కార్డ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. అలాగే రూ.4,000 ఎక్స్చేంజ్ బోనస్ ఆఫర్ కూడా అందిస్తుంది.
ఫీచర్ల గురించి మాట్లాడితే OnePlus 9 అండ్ OnePlus 9RT ఫోన్‌లు రెండూ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో వస్తున్నాయి. OnePlus 9లో కెమెరాతో లేని OISకి సపోర్ట్ OnePlus 9RTలో ఉంది. కాబట్టి మీరు ఆలోచించిన తర్వాత మాత్రమే కొనుగోలు చేయడం మంచిది. కేవలం ఆఫర్లను చూసి కొనుగోలు చేయవద్దు.