నైక్ స్మార్ట్ షూ.. బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు షూ లెస్ ఆటోమేటిక్‌గా కట్టేసుకుంటుంది..

Ashok Kumar   | Asianet News
Published : May 07, 2022, 05:36 PM ISTUpdated : May 07, 2022, 05:41 PM IST
నైక్ స్మార్ట్ షూ.. బ్లూటూత్  కనెక్టివిటీతో పాటు షూ  లెస్ ఆటోమేటిక్‌గా కట్టేసుకుంటుంది..

సారాంశం

నైక్ అడాప్ట్ బిబి  మరో విశేషమేమిటంటే, మీరు దానిని ధరించి నడుస్తున్నప్పుడు ఇంకా మీ పాదాలు ఉబ్బితే ఈ షూ మీ బ్లడ్ ప్రేజర్ కి అనుగుణంగా ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ అవుతుంది.  

మీరు  స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, స్మార్ట్ గాడ్జెట్‌లను ఎక్కువగా ఉపయోగించే ఉంటారు, అయితే  ఏదైనా స్మార్ట్ షూ గురించి అడిగితే మీ సమాధానం ఏంటి బహుశా తెలీదు అని ఉంటుంది. నైక్(nike) మీ కోసం ఒక స్మార్ట్ షూలను విడుదల చేసింది. ఈ నైక్ షూ స్మార్ట్ అండ్ పూర్తిగా ఆటోమేటిక్. ఈ నైక్ షూ రోబోట్ లాగా లేస్‌ని కట్టివేస్తుంది. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది.

ఈ నైక్ షూ పేరు అడాప్ట్ బిబి. లుక్స్ పరంగా చూస్తే బాస్కెట్‌బాల్ షూలా ఉంటుంది. ఈ షూ వేసుకున్న వెంటనే ఆటోమేటిక్‌గా లేస్‌లు కట్టుకోవడం ఈ షూ ప్రత్యేకత. మీరు బాస్కెట్‌బాల్ ప్లేయర్ అయితే, ఈ షూ మీకు బహుమతి కంటే ఎక్కువే.

బ్లడ్ ప్రేజర్ కూడా చెక్ చేస్తుంది
Nike Adapt BB బ్లడ్ ప్రేజర్ కూడా తెలియజేస్తుంది. Nike Adapt BB  మరో విశేషమేమిటంటే, మీరు దానిని ధరించి నడుస్తున్నప్పుడు ఇంకా మీ పాదాలు ఉబ్బితే, ఈ షూ మీ బ్లడ్ ప్రేజర్ కు అనుగుణంగా ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ అవుతుంది. ఈ షూ అవసరమైనప్పుడు ఆటోమేటిక్‌గా బిగుతుగా లేదా వదులుగా మారుతుంది.

మీరు యాప్ ద్వారా కూడా ఈ షూను పూర్తిగా కంట్రోల్ చేయవచ్చు. ఇంతకుముందు నైక్  బ్రాండ్ నైక్ + ఐపాడ్ అండ్ నైక్ + ట్రైనింగ్ వంటి స్మార్ట్ షూలను ప్రవేశపెట్టింది, వీటిని ప్రజలు కూడా ఇష్టపడ్డారు. భారతదేశంలో Nike Adapt BB లాంచ్ గురించి కంపెనీ ఎటువంటి సమాచారం వెల్లడించలేదు.

PREV
click me!

Recommended Stories

OPPO Find X9: 200 ఎంపీ కెమెరా, అదిరిపోయే ఏఐ ఫీచ‌ర్లు.. ఒప్పో నుంచి కొత్త ఫోన్
Best Camera Phones : 2025లో టాప్ 5 కెమెరా స్మార్ట్‌ఫోన్లు ఇవే