ఇండియాలోకి కొత్త అప్‌గ్రేడ్ వెర్షన్‌ ఫోన్.. పెద్ద బ్యాటరీ, గొప్ప డిస్‌ప్లేతో బెస్ట్ ఫీచర్స్ కూడా..

By asianet news teluguFirst Published Dec 5, 2022, 3:32 PM IST
Highlights

టెక్నో తాజాగా ఈ ఫోన్‌ను గ్లోబల్ మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. గ్లోబల్ మార్కెట్‌లో టెక్నో పోవ 4 8జి‌బి ర్యామ్ 128జి‌బి స్టోరేజ్ వేరియంట్ ధర $ 216 అంటే సుమారు రూ. 17,999.

స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ టెక్నో  బడ్జెట్ ఫోన్ టెక్నో పోవ 4ని ఇండియాలో లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ఈ ఫోన్ డిసెంబర్ 7న లాంచ్ కానుంది. అలాగే టెక్నో పోవ 3కి అప్‌గ్రేడ్ వెర్షన్‌లో పరిచయం చేయబోతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ 4G హ్యాండ్‌సెట్ మీడియా టెక్ హీలియో G99 ప్రాసెసర్‌, 6,000mAh బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్  వస్తుంది.

టెక్నో పోవ 4 ధర
టెక్నో తాజాగా ఈ ఫోన్‌ను గ్లోబల్ మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. గ్లోబల్ మార్కెట్‌లో టెక్నో పోవ 4 8జి‌బి ర్యామ్ 128జి‌బి స్టోరేజ్ వేరియంట్ ధర $ 216 అంటే సుమారు రూ. 17,999. అయితే ఈ ఫోన్‌ను రూ.15,000 కంటే తక్కువ ధరకే భారత్‌లో ప్రవేశపెట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

 స్పెసిఫికేషన్‌లు 
టెక్నో పోవ 4 6.82-అంగుళాల హెచ్‌డి ప్లస్ ఎల్‌సి‌డి డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. మీడియా టెక్ హెలియో G99 ప్రాసెసర్‌తో 128జి‌బి వరకు UFS2.2 స్టోరేజీ, 8జి‌బి వరకు LPDDR4X ర్యామ్ ఇచ్చారు. మైక్రో ఎస్‌డి కార్డ్ సహాయంతో స్టోరేజీని మరింత పెంచుకోవచ్చు. ఫోన్‌లో సెక్యూరిటి కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ సపోర్ట్ కూడా ఉంది.

 కెమెరా
టెక్నో పోవ 4లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్‌ల ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్‌ల సెకండరీ సెన్సార్  ఉన్నాయి. సెల్ఫీ అండ్ వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా సెన్సార్‌ ఇచ్చారు. బ్యాక్ కెమెరాతో LED ఫ్లాష్ సపోర్ట్ కూడా ఉంది.

 బ్యాటరీ
టెక్నో పోవ 4లో 6,000 mAh బ్యాటరీ ఇచ్చారు, ఇంకా 18 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. ఫోన్‌లోని ఇతర స్పెసిఫికేషన్‌లు 3.5ఎం‌ఎం ఆడియో జాక్, స్టీరియో స్పీకర్, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi అండ్ FM రేడియో కూడా ఉంది.

click me!