బడ్జెట్ రీఛార్జ్ ప్లాన్: ఒక సంవత్సరం వాలిడిటీతో రోజుకి 2జి‌బి డేటా కూడా.. ధర ఎంతంటే ?

By asianet news teluguFirst Published Dec 5, 2022, 2:20 PM IST
Highlights

బి‌ఎస్‌ఎన్‌ఎల్ ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ధర కేవలం రూ.1,515. బి‌ఎస్‌ఎన్‌ఎల్ ఈ బడ్జెట్ రీఛార్జ్ ప్లాన్‌తో 365 రోజుల వాలిడిటీ లభిస్తుంది. ఇంకా ఈ ప్లాన్‌తో రోజుకు 2జి‌బి హై స్పీడ్ డేటా పొందుతారు. 

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బి‌ఎస్‌ఎన్‌ఎల్) బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్‌ల విషయంలో జియో, ఎయిర్ టెల్  అధిగమించింది. బి‌ఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్ల ఛాయిస్ అండ్ అవసరాలకు అనుగుణంగా ఒక నెల నుండి ఒక సంవత్సరం వరకు వాలిడిటీతో కూడిన ప్లాన్‌లతో సహా చాలా రకాల చౌకైన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తుంది. మీరు బి‌ఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్ అయితే బడ్జెట్ రీఛార్జ్ ప్లాన్‌ కోసం చూస్తున్నట్లయితే ఈ ప్లాన్ మీకోసం. ఈ ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్ తో మీరు డైలీ డేటా, తక్కువ ఖర్చుతో ఆన్ లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం వంటి ఎన్నో బెనెఫిట్స్ పొందుతారు. ఈ ప్లాన్ గురించి తెలుసుకుందాం...

బి‌ఎస్‌ఎన్‌ఎల్ ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ధర కేవలం రూ.1,515. బి‌ఎస్‌ఎన్‌ఎల్ ఈ బడ్జెట్ రీఛార్జ్ ప్లాన్‌తో 365 రోజుల వాలిడిటీ లభిస్తుంది. ఇంకా ఈ ప్లాన్‌తో రోజుకు 2జి‌బి హై స్పీడ్ డేటా పొందుతారు. అంటే, మీరు ఒక సంవత్సరానికి 730జి‌బి డేటా లాభిస్తుంది. అయితే డైలీ డేటా లిమిట్ అయిపోయిన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 40Kbpsకి తగ్గుతుంది. 

బి‌ఎస్‌ఎన్‌ఎల్ రూ. 1,515 రీఛార్జ్ ప్లాన్‌తో మీరు ఆన్ లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని పొందుతారు. అయితే, ఈ బడ్జెట్ ప్లాన్‌తో OTT బెనెఫిట్స్ ఉండవు. అలాగే, ప్లాన్‌తో డైలీ ఎస్‌ఎం‌ఎస్ సౌకర్యం కూడా లేదు. 

రూ. 1,499 ప్లాన్ 
రూ.1,515 రీఛార్జ్ ప్లాన్ తో పాటు కంపెనీ రూ.1,499 ధరతో మరో ప్లాన్‌ను కూడా అందిస్తోంది. అయితే, ఈ ప్లాన్‌తో కొంచెం తక్కువ వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 336 రోజులు. ఇంకా ప్లాన్‌తో రోజుకు 100 ఎస్‌ఎం‌ఎస్ లు, 24జి‌బి డేటా  వస్తుంది. ఈ ప్లాన్ డేటాతో పాటు ఆన్ లిమిటెడ్ కాలింగ్ లభిస్తుంది కాబట్టి ఈ ప్లాన్‌ను సెకండరీ సిమ్ కోసం ఉపయోగించుకోవచ్చు.

click me!