కొద్ది రోజుల క్రితం వాట్సాప్ ఇప్పుడు ఒక కొత్త ఫీచర్‌పై పనిచేస్తోందని, ఈ ఫీచర్ విడుదలైన తర్వాత మీరు నంబర్ సేవ్ చేయనవసరం లేకుండా ఎవరికైనా మెసేజ్ పంపవచ్చని ఒక నివేదిక వచ్చింది.
వాట్సాప్ కొత్త ఫీచర్ల గురించి గత కొన్ని నెలలుగా చాలా వైరల్ గా మారింది. వాట్సాప్ కొత్త ఫీచర్స్ పై పనిచేస్తోందని రోజురోజుకు కొత్త కొత్త వార్తలు వస్తున్నాయి. గత కొన్ని నెలలుగా, WhatsApp ఎన్నో కొత్త ఫీచర్లను కూడా విడుదల చేసింది. కొద్ది రోజుల క్రితం వాట్సాప్ ఇప్పుడు ఒక కొత్త ఫీచర్‌పై పనిచేస్తోందని, ఈ ఫీచర్ విడుదలైన తర్వాత మీరు నంబర్ సేవ్ చేయనవసరం లేకుండా ఎవరికైనా మెసేజ్ పంపవచ్చని ఒక నివేదిక వచ్చింది. అయితే రాబోయే కొద్ది నెలల్లో WhatsAppలో రానున్న కొన్ని ఫీచర్ల గురించి..
మీరు నంబర్‌ను సేవ్ చేయకుండా మెసేజెస్ పంపవచ్చు
WhatsApp ట్రాకర్ WABetaInfo నివేదిక ప్రకారం, కొత్త అప్‌డేట్ తర్వాత, WhatsApp వినియోగదారులు నంబర్‌ను సేవ్ చేయకుండా ఎవరికైనా మెసేజ్ పంపవచ్చు. WhatsApp Android బీటా వెర్షన్ 2.22.8.11లో ఈ కొత్త ఫీచర్ కనిపించింది. కొత్త అప్‌డేట్ తర్వాత, ఎవరైనా వాట్సాప్ చాట్‌లో ఒకరి నంబర్‌ను షేర్ చేస్తే దానిపై ట్యాప్ చేయడం ద్వారా నేరుగా మెసేజ్ పంపవచ్చు. సాధారణంగా ఎవరైనా ఫోన్ లో సేవ్ చేసిన కాంటాక్ట్‌ను వాట్సాప్‌లో షేర్ చేస్తుంటారు, కానీ ఎవరైనా నంబర్‌ను టెక్స్ట్‌లో పంపితే దాన్ని సేవ్ చేయకుండా వాట్సాప్‌లో మెసేజ్ పంపడం సాధ్యం కాదు.
undefined
స్పామ్‌ను ఆపడానికి
స్పామ్‌ను నిరోధించడానికి, WhatsApp మెసేజెస్ ఐదుగురికి మాత్రమే ఫార్వార్డ్ చేసేందుకు పరిమితం చేసింది. ఇప్పుడు ఒక్కరికీ మాత్రమే ఫార్వార్డ్ చేసేందుకు పరిమితం చేస్తున్నట్లు నివేదించింది, అంటే మీరు ఫార్వార్డ్ చేసిన మెసేజ్ ఒక కాంటాక్ట్ లేదా గ్రూప్ తో మాత్రమే షేర్ చేయగలరు. నివేదిక ప్రకారం, WhatsApp iOS అండ్ Android ప్లాట్‌ఫారమ్‌లలో ఏకకాలంలో కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. అదేంటంటే స్పామ్‌ను అరికట్టడం అని కంపెనీ చెబుతోంది. WABetaInfo నివేదిక ప్రకారం, వాట్సాప్ బీటా వెర్షన్‌లోని గ్రూప్ లేదా కాంటాక్ట్‌కు ఫార్వార్డ్ చేసిన మెసేజెస్ పరిమితం చేసింది. కొత్త ఫీచర్‌ను ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.22.8.11లో చూడవచ్చు.
ఎమోజి రిప్లయి
వాట్సాప్ ఎమోజి రియాక్షన్‌ని అప్‌డేట్ చేయడం ప్రారంభించిందని WABetaInfo నివేదిక పేర్కొంది. కొత్త ఎమోజి రియాక్షన్ ఫీచర్‌ను ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.22.8.3లో చూడవచ్చు, అయితే బీటాలో ఈ ఫీచర్ ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కొత్త అప్‌డేట్ తర్వాత, వినియోగదారులు లైక్, లవ్, లాఫ్, సర్ప్రైజ్డ్, సాడ్ అండ్ థాంక్స్ వంటి మొత్తం ఆరు ఎమోజి రియాక్షన్‌లను చూస్తారు, అయితే వినియోగదారులు దీన్ని అనుకూలీకరించే సదుపాయాన్ని పొందుతారా లేదా అనే దాని గురించి ప్రస్తుతం సమాచారం లేదు. ఆండ్రాయిడ్‌తో పాటు డెస్క్‌టాప్ అండ్ ఐఓఎస్‌లకు ఎమోజీ రియాక్షన్ వస్తుందని WABetaInfo ట్వీట్ చేసింది.
ఒకేసారి 2జిబి వీడియోని
WhatsAppలో త్వరలో మరో కొత్త అప్‌డేట్ రాబోతోంది, దీని తర్వాత వినియోగదారులు WhatsAppలో 2జిబి వరకు ఫైల్‌లను సులభంగా షేర్ చేయవచ్చు. WABetainfo నివేదిక ప్రకారం, కొత్త అప్‌డేట్ iOS అండ్ Android రెండింటిలోకీ వస్తుంది, అయితే ఇది ప్రస్తుతం బీటా వెర్షన్‌లో పరీక్షించబడుతోంది. ప్రస్తుతం, వినియోగదారులు 100 MB వరకు ఫైల్‌లను షేర్ చేయగలరు. వాట్సాప్ అర్జెంటీనాలో iOS అండ్ Android యాప్‌ల బీటా వెర్షన్‌లలో 2జిబి ఫైల్ షేరింగ్‌ని పరీక్షిస్తోంది. కొత్త ఫీచర్‌ని ఆండ్రాయిడ్ వెర్షన్‌లు 2.22.8.5, 2.22.8.6, 2.22.8.7 వాట్సాప్ బీటాలో చూడవచ్చు, అయితే iOS బీటా వెర్షన్‌లు 22.7.0.76లో చూడవచ్చు.
వాయిస్ మెసేజ్‌ల రికార్డింగ్‌ను పాజ్ చేయవచ్చు
WhatsApp కొత్త అప్‌డేట్‌తో వాయిస్ మెసేజ్‌ల రికార్డింగ్‌ను పాజ్ చేసి మళ్లీ ప్రారంభించవచ్చు. అంతేకాకుండా వినియోగదారులు వాయిస్ మెసేజ్ తో పాటు వీజ్యువల్ వేవ్ ఫార్మ్ కూడా చూస్తారు. అంతేకాకుండా చాట్ ప్లేబ్యాక్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంటుంది అంటే మీరు చాట్ నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా వాయిస్ మెసేజ్ వినవచ్చు ఇంకా ఇది అతిపెద్ద అప్ డేట్. ఇప్పటి వరకు చాట్ నుండి బయటకు రాగానే వాయిస్ మెసేజ్ ప్లే కావడం ఆగిపోయేది. వాయిస్ మెసేజ్‌ని వింటూనే మీరు కొన్ని ఇతర పనులు చేసుకోవచ్చు.