రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం మూడు రోజుల మానిటరీ పాలసీ కమిటీ సమావేశ ఫలితాలను వెల్లడించింది. రిజర్వ్ బ్యాంక్ వరుసగా 11వ సారి రెపో రేట్లను యధాతదంగా కొనసాగించింది. దీనితో పాటు ఆర్‌బిఐ గవర్నర్ పెద్ద ప్రకటన చేస్తూ, ఇప్పుడు అన్ని బ్యాంకుల ఎటిఎంలలో కార్డ్‌లెస్ క్యాష్ విత్ డ్రా సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు.
డిజిటలైజేషన్ అనేది ప్రజలకు ప్రయోజనకరంగా ఉన్న చోట దాని ప్రతికూలతలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఆన్‌లైన్ మోసాల కేసులు రోజురోజుకు తెరపైకి వస్తూనే ఉన్నాయి, దీనికి తోడు ఎటిఎంలలో కార్డ్ క్లోనింగ్ వంటి సంఘటనలతో సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ పెద్ద ప్రకటన చేసింది. దీని కింద కార్డ్‌లెస్ క్యాష్ విత్ డ్రా సదుపాయం ఇప్పుడు ప్రతి బ్యాంకు ఏటీఎంలో అందుబాటులో ఉంటుంది.
ఆర్‌బిఐ గవర్నర్ ప్రకటన
ఆర్‌బిఐ ద్రవ్య విధాన సమావేశ ఫలితాలను దృష్టిలో ఉంచుకుని ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ పెద్ద ప్రకటన చేసారు. పెరుగుతున్న డిజిటల్ మోసాలకు చెక్ పెట్టేందుకు ఆర్‌బీఐ కట్టుబడి ఉందన్నారు. ఈ కేసులను నివారించడానికి ఇప్పుడు దేశంలోని అన్ని బ్యాంకుల్లో కార్డ్‌లెస్ క్యాష్ విత్ డ్రా సౌకర్యం అందించబడుతుంది. ఈ సదుపాయం కింద ఏటీఎంల నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకునేందుకు ఇకపై డెబిట్ కార్డ్ అవసరం ఉండదు.
undefined
యూపిఐ సహాయంతో ఇప్పుడు మీరు డెబిట్ కార్డ్ ఉపయోగించకుండా ఏ బ్యాంక్ ఏటిఎం నుండి అయినా డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చు . కొన్ని ఎంపిక చేసిన బ్యాంకులు ఇప్పటికే కస్టమర్లకు ఈ కార్డ్‌లెస్ సదుపాయాన్ని అందిస్తున్నాయని తెలిపింది. కానీ, ఇప్పుడు గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటన తర్వాత అన్ని బ్యాంకులు ఏటీఎంలలో ఈ సదుపాయాన్ని కల్పించాల్సి ఉంటుంది. ఈ సదుపాయం ద్వార మీరు మీ కార్డు బ్యాంకు ఏటిఎంకి మాత్రమే వెళ్లాలి.
ఖాతాదారుల గుర్తింపు
అన్ని బ్యాంకులు, మొత్తం ఏటిఎం నెట్‌వర్క్‌లు/ఆపరేటర్లలో కార్డ్ లెస్ క్యాష్ విత్‌డ్రాయల్ సదుపాయాన్ని అందించాలని ప్రతిపాదించినట్లు ఆర్‌బిఐ తెలియజేసింది. ఈ సదుపాయం ద్వారా ఒక వ్యక్తి ఏటిఎం నుండి డబ్బును తీసుకున్నప్పుడు ఖాతాదారుడి గుర్తింపు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ద్వారా అతేంటికెటెడ్ చేయబడుతుంది. తద్వారా మోసాల కేసులు తక్కువగా ఉంటాయి. ఏటీఎం ద్వారా డబ్బులు డ్రా చేసుకునే వారిపై మోసాలకు పాల్పడుతున్న కేసులు నానాటికీ పెరుగుతుండటం గమనార్హం.
రిజర్వ్ బ్యాంక్ ప్రకారం కార్డు లేకుండా డబ్బును ఉపసంహరించుకోవడం స్కిమ్మింగ్, కార్డ్ క్లోనింగ్, డివైజ్ ట్యాంపరింగ్ వంటి మోసాలను నిరోధించడంలో సహాయపడుతుంది. కార్డ్‌లెస్ నగదు ఉపసంహరణ సౌకర్యాన్ని రిజర్వ్ బ్యాంక్ పెంచడానికి ఇదే ప్రధాన కారణం.