smartphones : ఫోన్లు పేలడం అసాధారణమే అయినప్పటికీ.. అప్పుడప్పుడు ఇలాంటి ఘటనలు ఎప్పటికప్పుడు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అయితే, ఈ ఫోన్లు ఎందుకు పేలుతున్నాయి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? పేలుడు సంభవించడానికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
smartphones: స్మార్ట్‌ఫోన్‌లు పేలిపోవడం అనేది అసాధారణమైన విషయమే అయినప్పటికీ.. అప్పుడప్పుడు ఇలాంటి ఘటనలు ఎప్పటికప్పుడు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇటీవల, వన్‌ప్లస్ నార్డ్ సిరీస్ ఫోన్‌లు పేలుతున్నట్లు వార్తలు వచ్చాయి. వీటి జతకు మరికొన్ని చేరాయి. అయితే, ఈ ఫోన్లు ఎందుకు పేలుతున్నాయి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? పేలుడు సంభవించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఫోన్లు పేలిపోవడానికి అనేక కారణాలు వున్నాయి. అయితే, అత్యంత సాధారణమైనది అంశం ఫోన్ బ్యాటరీ. కొత్తగా వస్తున్న హ్యాండ్‌సెట్స్ లో లిథియం-అయాన్ బ్యాటరీలు ఉంటున్నాయి. లిథియంతో పాటు ధన అయాన్ క్యాథోడ్, రుణ అయాన్ ఆనోడ్ ఉంటాయి. ఈ రెండింటినీ వేరు చేస్తూ కర్బన ద్రవం ఎలక్ట్రోలైట్ ఉంటుంది. ధన, రుణ అయాన్లు ఒకదానికొకటి తాకితే రసాయన చర్య జరిగి పేలుడు సంభవిస్తుంది. బ్యాటరీలోని లోపల ఉండే భాగాలు దెబ్బతినడం కూడా పేలుడుకు కారణమవుతుంది.
బ్యాటరీలు ఎలా పాడవుతాయి?
అనేక కారణాల వల్ల బ్యాటరీలు పాడవుతాయి. అత్యంత సాధారణ సమస్య అధిక వేడి. ఛార్జింగ్ చేసే సమయంలో బ్యాటరీలు ఓవర్ హీట్ కు గురికావడం వల్ల పాడవుతాయి. అయితే మొబైల్‌లో నాణ్యత లేని బ్యాటరీలతో సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. బ్యాటరీ లోపల ఉండే చిన్న వస్తుల డ్యామేజ్ కూడా బ్యాటరీ పాడుకావడానికి కారణం అవుతుంది.
ఫోన్ పేలడం.. బ్యాటరీలు వేడెక్కడానికి కారణాలు అధికంగానే ఉన్నాయి. ఫోన్‌ను ఎక్కువసేపు ఎండలో ఉంచడం, మాల్వేర్ అటాక్ కారణంగా CPUని ఎక్కువగా పని చేయడం.. ఎక్కువగా ఛార్జ్ చేయడం వంటివి ఫోన్ లోపల షార్ట్ సర్క్యూట్‌కు కారణం కావచ్చు. అలాగే, వినియోగదారుల నియంత్రణలో లేని కొన్ని కారణాలు ఉన్నాయి. అనేక సంవత్సరాలు ఉపయోగించిన పరికరాలు అంతర్గత భాగాలను ఫేడ్ చేయగలవు. చాలా కాలం పాటు స్మార్ట్ ఫోన్ లు వాడిన తర్వాత బ్యాటరీలు ఉబ్బడం, ఫోన్ లోని ఇతర భాగాలు లైఫ్ టైం దగ్గరపడటం కారణంగా కూడా ఓవర్ హీట్ కు కారణమై స్మార్ట్ ఫోన్ లో పేలుడు సంభవించే అవకాశాలు ఉన్నాయి.
ముందు జాగ్రత్త చర్యలు..
సాధారణంగా ఫోన్లు పేలిపోయే ముందు షార్ట్ సర్క్యూట్‌కు గురవుతాయి. ఈ సమయంలో గాడ్జెట్ నుంచి వాసన రావడం.. చిన్నగా శబ్దాలు రావడం.. ప్లాస్టిక్ లేదా రసాయనాలు మండుతున్న వాసన వస్తుంది. ఇలాంటివి గమనిస్తే.. వెంటనే పేలుడు సంభవిస్తుందని గుర్తుచుకోవాలి. ఒక్కోసారి ఈ సూచనలు లేకుండానే ఒక్కసారిగా పేలిపోతుంటాయి. దీని ముందు మాత్రం ఓవర్ హీట్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఓవర్ హీట్ ను గుర్తించే ఫోన్ ఛార్జింగ్ పెట్టివుంటే దానిని తొలగించాలి.
ఇక ఫోన్ బ్యాటరీలు ఉబ్బినట్లు కనిపిస్తే వెంటనే వాటిని ఫోన్ నుంచి మార్చుకోవాలి. అలానే, వాటిని వాడితే పేడులు జరిగే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఆయా ఫోన్ కంపెనీకి చెందిన ఒరిజనల్ ఛార్జర్లు, బ్యాటరీలు మాత్రమే వాడుకోవాలి. ఫోన్ నీళ్లలో పడిపోతే వెంటనే ఛార్జింగ్ పెట్టకూడదు. ఫోన్ హీట్ ఎక్కువగా ఉంటే కేసును తొలగించాలి.