రోబోల దాటికి ఉద్యోగాలు హాంఫట్...మరో పారిశ్రామిక విప్లవం రానుంది

By Arun Kumar PFirst Published Aug 20, 2018, 6:58 PM IST
Highlights

ప్రతి రంగంలోను రోబోల ప్రవేశిస్తుండటం అత్యంత ప్రమాదకర పరిణామమని భ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ చీఫ్ ఎకనమిస్ట్ ఆండీ హెల్డాన్ హెచ్చరించారు. వీటి వల్ల సామాజిక అశాంతి పెరిగే అవకాశం ఉందన్నారు. వీటి రాకతో మనుషుల అవసరం తగ్గి భారీగా ఉద్యోగాల కోత ఏర్పడే అవకాశం ఉందన్నారు. దీంతో నిరుద్యోగిత పెరిగి మనుషులు ఇబ్బందుల పాలయ్యే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు.

మనుషులు శారీరకంగా చేసే పనులనే కాదు మేదస్సుతో చేసే పనులను కూడా ఈ కృత్రిమ యంత్రాలు అవలీలగా చేస్తున్నాయి. అంతేకాకుండా మనుషుల కంటే ఖచ్చితత్వంతో ఏలాంటి పొరపాట్లు లేకుండా వీటి పనితనం ఉంటుంది. దీంతో వివిధ పరిశ్రమలు మానవ వనరులకు బదులు వీటిని వినియోగించడం ప్రారంభించాయి. ఇది
నాలుగో పారిశ్రామిక విప్లవానికి దారితీస్తోందని ఆండీ తెలిపారు.

అయితే ఈ ప్రమాదం నుండి తప్పించుకోడానికి ఉద్యోగులు తమ ప్రతిభకు మెరుగులు పెడుతూ అత్యుత్తమమైన పనితనాన్ని కలిగి ఉండాలని ఆయన సూచించారు. అప్పుడే ఈ పోటీని తట్టుకుని నిలవగల్గుతారన్నారు. 

ఆధునిక సాంకేతికతతో జరుగుతున్న ఈ మార్పులు మానవ జాతిపై ఫెను ప్రభావాన్ని చూపనున్నాయని హెచ్చరించారు. ఇది పెను విధ్వంసానికి దారితీస్తాయని హెచ్చరించారు. అకౌంటెన్సీ సహా పలు రంగాలు రోబోల ధాటికి ఉద్యోగాలను పెద్ద సంఖ్యలో కోల్పోతాయని ఆండీ వివరించారు.

click me!