ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్...కష్టమర్లకు ఉచితంగా...

By ramya neerukondaFirst Published 16, Aug 2018, 2:37 PM IST
Highlights

తన కస్టమర్లందరికీ ఉచితంగా అమెజాన్ పే గిఫ్ట్ కార్డులను అందివ్వనున్నట్లు ప్రకటించింది. 

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ తన కష్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. తన కస్టమర్లందరికీ ఉచితంగా అమెజాన్ పే గిఫ్ట్ కార్డులను అందివ్వనున్నట్లు ప్రకటించింది.  అందుకు గాను కస్టమర్లు ఏం చేయాలంటే.. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫాంలపై మై ఎయిర్‌టెల్ యాప్ ఓపెన్ చేసి అందులో హోమ్ పేజీలో ఉండే ఎయిర్‌టెల్ థ్యాంక్స్ బ్యానర్‌పై క్లిక్ చేయాలి.

అనంతరం మీ ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. తరువాత వచ్చే ఓటీపీని కన్‌ఫాం చేయాలి. దీంతో 15 డిజిట్లు ఉన్న వోచర్ కోడ్ కస్టమర్‌కు లభిస్తుంది. ఈ కోడ్‌ను అక్టోబర్ 31వ తేదీ లోపు అమెజాన్ పే అకౌంట్‌లో యాడ్ చేసి ఉపయోగించుకోవాలి.

దీంతో కస్టమర్‌కు రూ.51 విలువైన అమెజాన్ పే వాలెట్ బ్యాలెన్స్ లభిస్తుంది. దాన్ని అమెజాన్‌లో వస్తువులు కొనేందుకు లేదా రీచార్జి చేసుకునేందుకు ఉపయోగించుకోవచ్చు. అయితే ఎయిర్‌టెల్‌లో రూ.100 ఆపైన విలువైన బండిల్డ్ ప్రీపెయిడ్ ప్యాక్‌ను లేదా పోస్ట్‌పెయిడ్ ఇన్ఫినిటీ ప్లాన్‌ను వాడే కస్టమర్లు మాత్రమే ఈ ఆఫర్‌ను పొందగలుగుతారు. ఎయిర్‌టెల్ తన 23వ వార్షికోత్సవ సంబరాల్లో భాగంగా తన కస్టమర్లందరికీ ఈ బంపర్ ఆఫర్‌ను అందిస్తున్నది.

Last Updated 9, Sep 2018, 10:58 AM IST