నిన్న ట్విట్టర్ సి‌ఈ‌ఓ, నేడు బోర్డు డైరెక్టర్లు.. ట్విట్టర్ లో కొనసాగుతున్న తొలగింపులు..

Published : Nov 01, 2022, 09:27 AM IST
నిన్న ట్విట్టర్ సి‌ఈ‌ఓ, నేడు బోర్డు డైరెక్టర్లు.. ట్విట్టర్ లో కొనసాగుతున్న తొలగింపులు..

సారాంశం

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్‌కు దాఖలు చేసిన డాక్యుమెంట్స్ ప్రకారం టెస్లా చీఫ్ ఎలోన్ మస్క్ సోమవారం ట్విటర్ బోర్డు ఆఫ్ డైరెక్టర్లను తొలగించి, ఏకైక డైరెక్టర్ గా  మారారు. అయితే ఆయన దీనికి సంబంధించి మిగతా వివరాలేమీ అందించలేదు.  

ట్విట్టర్  కొత్త చీఫ్ ఎలోన్ మస్క్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ట్వీట్టర్ మొత్తం బోర్డుని తొలగించి ఇప్పుడు సోషల్ మీడియా దిగ్గజానికి ఏకైక డైరెక్టర్‌గా  నిలిచారు. నవంబర్ 1కి ముందు కంపెనీలో భారీ తొలగింపులు జరిగినట్లు వచ్చిన నివేదికలను ఎలోన్ మస్క్ తిరస్కరించిన కొన్ని గంటల తర్వాత ఈ చర్య జరిగింది.

ట్వీట్టర్ కొత్త బాస్ చేసిన ఈ చర్యతో ట్వీట్టర్ బోర్డులోని ఇంతముముందు ఉన్న వారు ఇకపై బోర్డు డైరెక్టర్లుగా ఉండరు.

తొలగించిన ఉద్యోగులకు స్టాక్ గ్రాంట్‌లను చెల్లించకుండా ఉండాలని ఎలోన్ మస్క్ కోరుకుంటున్నారని, అందుకే నవంబర్ 1 గడువును నిర్ణయించినట్లు ఒక నివేదిక ముందు రోజు పేర్కొంది.

$44 బిలియన్లకు ట్వీట్టర్ ని కొనుగోలు చేసిన తర్వాత సీఈఓ పరాగ్ అగర్వాల్, సి‌ఎఫ్‌ఓ నెడ్ సెగల్, పాలసీ చీఫ్ విజయ గద్దెతో సహా టాప్ లీడర్స్  ని  ఎలోన్ మస్క్ తొలగించారు.

టెస్లా చీఫ్ ఎలోన్ మస్క్ నవంబర్ 7 లోపు  వెరిఫికేషన్ (బ్లూ టిక్)  ప్రాసెస్  పూర్తి చేయాలని ఒక బృందాన్ని కోరినట్లు నివేదించబడింది.

ట్విటర్ సిబ్బందిలో 75 శాతం మందిని ఎలోన్ మస్క్ తొలగించవచ్చని, దీని వల్ల ఉద్యోగుల సంఖ్య 7,500 నుంచి 2,000కి తగ్గుతుందని ప్రత్యేక నివేదిక పేర్కొంది. ఇంగ్లిష్ న్యూస్  పబ్లికేషన్స్  ప్రకారం ఇంటర్నల్ డాక్యుమెంట్స్ అండ్ ట్విట్టర్ ఉద్యోగుల నుండి ప్రత్యక్ష సమాచారం ఆధారంగా ఈ విషయంపై నివేదించినందున తొలగింపుల గురించి ఊహాగానాలు ఏకపక్షంగా ఉన్నప్పటికీ  ఎలోన్ మస్క్ దీనిని ఖండించారు.

PREV
click me!

Recommended Stories

Starlink : ఎలన్ మస్క్ స్టార్‌లింక్ భారత్‌లో స్టార్ట్ : ప్లాన్‌లు, స్పీడ్, సైన్‌అప్.. ఫుల్ డిటెయిల్స్ ఇవే
మీ ఫోన్ లో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా..? అయితే వాట్సాప్ హ్యాక్ అయినట్లే, ఈ టైమ్ లో ఏం చేయాలి?