అమెజాన్ పై పోలీస్ కేసు నమోదు...ఎందుకంటే...

By Sandra Ashok KumarFirst Published Jan 13, 2020, 5:14 PM IST
Highlights

భారతదేశంలో  ప్రసిద్ధి చెందిన ప్రముఖ గోల్డెన్ టెంపుల్ చిత్రాన్ని టాయిలెట్ మాట్స్ పై ముద్రించి అమ్మకాని అనుమతించినందుకు అమెజాన్ ఇండియాపై ఎఫ్ఐఆర్ దాఖలైంది.
 

భారతదేశ రిటైల్ దిగ్గజం అమెజాన్ ఇండియాపై ఢిల్లీ నగరంలోని సిక్కు గురుద్వరా మేనేజ్‌మెంట్ కమిటీ (డిఎస్‌జిఎంసి) చీఫ్ మంజిందర్ సింగ్ సిర్సా  ఎఫ్‌ఐ‌ఆర్ నమోదు చేశారు. ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్ అయిన అమేజాన్  గోల్డెన్ టెంపుల్ చిత్రాన్ని ముద్రించి ఉన్న  టాయిలెట్ మాట్స్‌ను విక్రయించడానికి అనుమతించింది. సిక్ కమ్యూనిటీ మనోభావాలను దెబ్బతీసినందుకు కేసు నమోదు చేశారు.

also read  బెంగళూరును బీట్ చేసిన హైదరాబాద్... ఐటీ ఉద్యోగాలకు మనమే బెస్ట్...


ప్రముఖ ఇ-కామర్స్ ఇంతకుముందు కూడా ఇలాంటి ఫ్లాక్‌ను ఎదుర్కొంది.  హరియాణ స్టేట్ లోని సిర్సా ట్విట్టర్‌ ద్వారా గోల్డెన్ టెంపుల్ చిత్రాలతో ముద్రించిన  కొన్ని బాత్రూమ్ మ్యాట్లను చిత్రాలను పోస్ట్ చేసింది."సిక్కు మనోభావాల పట్ల అమెజాన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది" అని సిర్సా ట్వీట్ చేసింది.


ఈ-కామర్స్ దిగ్గజం అలాంటి విక్రేతను నిషేధించాలని అలాగే  ప్రపంచ వ్యాప్తంగా సిక్కులకు క్షమాపణ చెప్పాలని ఆయన కోరారు. అంతకుముందు 2018లో, అమెజాన్ అనేక సిక్కు మతస్తులకు సంభంధించిన, రగ్గులు, టాయిలెట్ ఉపకరణాలను అత్యంత గౌరవనీయమైన గోల్డెన్ టెంపుల్ చిత్రాన్ని అమ్మకానికి అనుమతించారు.

also read  దేశీయంగా ఐటీ రంగంలో... ఉద్యోగాల జోరు... మూడేళ్లలో 44 శాతం

ప్రపంచవ్యాప్తంగా  సమాజ సిక్కు మనోభావాలను దెబ్బతీసే విధంగా" ఉత్పత్తులను" వెంటనే తొలగించమని కోరింది.మెరికాలోని ప్రముఖ కమ్యూనిటీ బాడీ, సిక్కు కూటమి, అమెజాన్ గోల్డెన్ టెంపుల్ చిత్రంతో డోర్ మాట్స్, రగ్గులు మరియు టాయిలెట్ సీట్ కవర్లను అమ్ముతున్నట్లు హెచ్చరించింది.
 

click me!