బెంగళూరును బీట్ చేసిన హైదరాబాద్... ఐటీ ఉద్యోగాలకు మనమే బెస్ట్...

By Sandra Ashok KumarFirst Published Jan 13, 2020, 11:52 AM IST
Highlights

గతంలో ఐటీకి, వేతనాలకు అనువైన సిటీగా బెంగళూరు ఉండేది. కానీ ఇప్పుడు హైదరాబాద్ ఆ స్థానాన్ని ఆక్రమిస్తోందని రాండ్‌‌స్టాడ్ ఇన్‌‌సైట్స్ శాలరీ ట్రెండ్స్ అధ్యయనం పేర్కొంది. 

న్యూఢిల్లీ: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) అంటేనే గుర్తకు వచ్చేది బెంగళూరు సిటీ. దేశంలోనే ఎక్కువ శాలరీలు ఇచ్చే నగరాల్లో తొలిస్థానంలో ఉంది. ఇప్పుడు బెంగళూరుకు దీటుగా ఐటీ ఉద్యోగులకు జీతాలిస్తోంది భాగ్యనగరం. దేశంలో బెంగళూరు తర్వాత, హైదరాబాద్​లోని ఐటీ కంపెనీలే ఎక్కువ జీతాలు చెల్లిస్తున్నట్లు రాండ్‌‌స్టాడ్ ఇన్‌‌సైట్స్ శాలరీ ట్రెండ్స్ రిపోర్ట్–2019 వెల్లడించింది.

also read క్రెడిట్ కార్డ్ వినియోగిస్తున్నారా..అయితే వీటి గురించి తెలుసుకోండి: లేదంటే..

దేశవ్యాప్తంగా వివిధ సిటీల్లో సుమారు లక్ష మంది ఉద్యోగులను అధ్యయనం చేసిన తర్వాత ఈ నివేదికను రూపొందించింది.  సీనియర్ కన్సల్టెంట్​కు ఏడాదికి సగటున రూ.35.45 లక్షలు చెల్లిస్తుండగా, మిడ్ లెవల్​​ కన్సల్టెంట్​కు16.45 లక్షలు, జూనియర్ కన్సల్టెంట్​కు రూ.5.27 లక్షలు వరకు చెల్లిస్తూ అత్యధిక జీతాలు ఇచ్చే సిటీగా బెంగళూరు నిలిచింది.

సీనియర్ కన్సల్టెంట్​కు రూ.33.95 లక్షలు, మిడ్ లెవల్ కన్సల్టెంట్​కు రూ.15.7 లక్షలు, జూనియర్ కన్సల్టెంట్​కు రూ.5 లక్షలు చెల్లిస్తూ హైదరాబాద్ సిటీ రెండో స్థానంలో ఉంది. సీనియర్ కన్సల్టెంట్​కు రూ.32.68 లక్షలు, మిడ్ లెవల్ కన్సల్టెంట్​కు రూ.14.5 లక్షలు, జూనియర్ కన్సల్టెంట్​కు రూ.4.59 లక్షలు చెల్లిస్తూ ముంబై మూడో స్థానంలో నిలిచింది.

also read 35 రకాల అవుట్ డేటెడ్ యాపిల్ ప్రొడక్ట్ ఏంటో తెలుసా..?

హైదరాబాద్ ఐటీ కంపెనీలకు అనువైన ప్రాంతం. ఇక్కడ మౌలిక వసతులతోపాటు నైపుణ్యం గల ఉద్యోగులు ఎక్కువగా ఉండటంతో ఐటీ పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. చిన్నవి, పెద్దవి కలుపుకుని సుమారు 5000కి  పైగా ఐటీ కంపెనీలు ఉన్నాయి. వీటిలో ఆరు లక్షల మంది వరకు ఉద్యోగులు పనిచేస్తున్నారు. 

భాగ్యనగరంలో పని చేసే ఐటీ ఉద్యోగులు ఇతర దేశాల ప్రాజెక్టులను విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లడంలో కీలకంగా మారుతున్నారు. ‘‘ఆర్టిఫీషియల్ టెక్నాలజీకి సంబంధించిన ప్రాజెక్టులు హైదరాబాద్‌లో ఎక్కువుగా ఉన్నాయి. ఉద్యోగులు నిత్యం కొత్త కోర్సులు నేర్చుకుంటూ రాణిస్తున్నారు. దీంతోనే వివిధ కంపెనీలు ఎక్కువ శాలరీలు ఇస్తున్నయ్” అని టీటా అధ్యక్షుడు సందీప్​కుమార్ మక్తలా చెప్పారు.

click me!