ఐఫోన్ రిపేర్ కి ఇస్తే ఫేస్‌బుక్‌లో నగ్న ఫోటోలు, వీడియొలు లీక్.. ఆపిల్‌ కంపెనీకి కోట్ల జరిమానా..

By asianet news telugu  |  First Published Jun 7, 2021, 7:49 PM IST

 ఓ విద్యార్థిని నగ్న ఫొటోలు, వీడియోలు బయటకు రావడంతో ఐ ఫోన్‌ సంస్థ కొన్ని కోట్ల రూపాయల పరిహారం చెల్లించాల్సి వస్తోంది. ఈ ఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగింది.


సోషల్ మీడియా ఫేస్ బుక్ లో ఓ యువతి నగ్న ఫోటోలు, వీడియోలను పోస్ట్ కావడంతో  టెక్నాలజి దిగ్గజం ఆపిల్ సంస్థ యువతికి పరిహారంగా కొన్ని కోట్ల రూపాయలు  చెల్లించింది.  2016లో కాలిఫోర్నియాలోని ఒరెగాన్‌కు చెందిన ఓ యూనివర్సిటీ విద్యార్థి తన ఫోన్‌ రిపేర్‌  కోసం సమీపంలోని ఆపిల్ సర్వీస్‌ సెంటర్‌కు  తీసుకెళ్లింది.

అక్కడ తన ఫోన్‌ రిపేర్ చేయమని సర్వీస్‌ సెంటర్‌కి అందచేసింది.  ఫోన్ రిపేర్ చేసే సమయంలో ఫోన్ లో ఉన్న  విద్యార్థి  నగ్న ఫోటోలను, సెక్స్ వీడియోను రిపేర్ చేసే టెక్నీషియన్లు ఆ యువతి  ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో  ఈ పోస్ట్ గురించి ఆమె స్నేహితులు తనకి తెలియజేయడంతో  వాటిని వెంటనే తొలగించింది.

Latest Videos

undefined

also read 

అయితే ఫేస్ బుక్ ఈ పోస్ట్ కంటెంట్ ని ఆమెనే స్వయంగా తన ఖాతా నుండి అప్ లోడ్ చేసినట్లు సూచించింది. ది టెలిగ్రాఫ్ గుర్తించిన చట్టపరమైన దాఖలాల ప్రకారం పరిహారంపై ఖచ్చితమైన మొత్తం వెల్లడించబడలేదు.   అమ్మాయికి సంబంధించిన అంశం కావడంతో ఆపిల్ సంస్థ ఈ కేసును సున్నితంగా డీల్‌ చేసింది.

ఈ సంఘటనపై యువతికి పరిహారం చెల్లించడంతో ఈ ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా ఆపిల్ గోప్యత నిబంధనని కూడా అంగీకరించింది. ఈ కేసుపై చర్చించకుండా లేదా పరిహారం మొత్తాన్ని బహిర్గతం చేయకుండా యువతిని నిరోధించింది.

యువతి ఫోటోలు, వీడియొని ఫేస్ బుక్ లో  అప్ లోడ్ చేసిన ఇద్దరిని ఉద్యోగాల నుంచి సంస్థ తొలగించింది.  అలాగే తమ తప్పిదం జరగడంతో యువతితో ఐఫోన్‌ రహాస్య ఒప్పందం చేసుకున్నట్లు కూడా తేలింది.  అలాగే సంస్థకు చెడ్డపేరు రాకుండా ఈ విధంగా రహాస్య ఒప్పందం చేసుకున్నారని తెలిసింది.
 
 

click me!