సోనీ ఎక్స్ పీరియా ఫోన్లపై భారీ తగ్గింపు

First Published 7, Jul 2018, 10:58 AM IST
Highlights

పలు మోడళ్లపై భారీ తగ్గింపు ప్రకటించిన సోనీ

ఒక మోడల్ పై దాదాపు రూ.10వేలు తగ్గింపు

ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ సోనీ..తమ కంపెనీకి చెందిన పలు స్మార్ట్ ఫోన్లపై ధరను తగ్గించింది. ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్‌ఎస్‌, ఎక్స్‌పీరియా ఎల్‌2, ఎక్స్‌పీరియా ఆర్‌1 స్మార్ట్‌ఫోన్లపై జూలై 6 నుంచి ధరలు తగ్గించినట్టు సోనీ ప్రకటించింది. 

అధికారిక ప్రకటన ప్రకారం, ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్‌ఎస్‌ స్మార్ట్‌ఫోన్‌ రూ.29,990 కు అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ అసలు ధర 39,990 రూపాయలు. అంటే 10 వేల రూపాయల మేర ధర తగ్గింది. ఇక ఎక్స్‌పీరియా ఎల్‌2 స్మార్ట్‌ఫోన్‌ ధరను కూడా రూ.19,990 నుంచి రూ.14,990కు తగ్గించింది సోనీ కంపెనీ. 

ఎక్స్‌పీరియా ఆర్‌1 స్మార్ట్‌ఫోన్‌ను రూ.9,990 కే అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ అసలు ధర రూ.10,990గా ఉండేది. ఈ ధరలు సోనీ అన్ని సెంటర్లలోనూ, అమెజాన్‌.ఇన్‌, ఫ్లిప్‌కార్ట్‌, ఇతర ఎలక్ట్రానిక్స్‌ స్టోర్లలో అందుబాటులో ఉండనున్నట్టు కంపెనీ చెప్పింది. ధర తగ్గక ముందు సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్‌ఎస్‌ స్మార్ట్‌ఫోన్‌ అమెజాన్‌.ఇన్‌లో రూ.39,990కు లభ్యమయ్యేది. 
 

Last Updated 7, Jul 2018, 10:58 AM IST