షాకింగ్ నిర్ణయం ప్రకటించిన జియో .. త్వరలో వాటికి ఛార్జ్ చెల్లించాల్సిందే..

Published : May 15, 2023, 01:13 PM ISTUpdated : May 15, 2023, 01:30 PM IST
షాకింగ్ నిర్ణయం ప్రకటించిన జియో .. త్వరలో వాటికి ఛార్జ్ చెల్లించాల్సిందే..

సారాంశం

జియో సినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ సబ్‌స్క్రైబర్‌లు రూ. 999 వార్షిక ప్లాన్‌తో క్వాలిటీ  వీడియో, ఆడియోను పొందుతారు. కంటెంట్‌ను ఒకేసారి నాలుగు డివైజెస్ లో ప్లే  చేయవచ్చు. 

ఓటిటి  స్ట్రీమింగ్ సర్వీస్ జియో సినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ సర్వీస్ ప్రారంభించింది. ఈ ప్లాన్ ధర రూ.999 సంవత్సరానికి.  దేశంలోని ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ అయినా జియో సినిమా టాలీవుడ్ తో సహా  హాలీవుడ్ కంటెంట్‌కు యాక్సెస్ అందిస్తుంది. జియో సినిమా అనేది FIFA వరల్డ్ కప్ అండ్ IPL 2023 వంటి పాపులర్ కంటెంట్‌ను ఉచితంగా ప్రసారం చేస్తూ  వ్యువర్స్ సంపాదించుకున్న యాప్. ఈ యాప్ ది లాస్ట్ ఆఫ్ అస్, హౌస్ ఆఫ్ ది డ్రాగన్ వంటి షోలతో సహా HBOలో ప్రీమియం కంటెంట్‌ను అందించనున్నట్లు ప్రకటించబడింది. ఐపీఎల్ తర్వాత కొత్త ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ అమల్లోకి రానుంది.

జియో సినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ సబ్‌స్క్రైబర్‌లు రూ. 999 వార్షిక ప్లాన్‌తో క్వాలిటీ  వీడియో, ఆడియోను పొందుతారు. కంటెంట్‌ను ఒకేసారి నాలుగు డివైజెస్ లో ప్లే  చేయవచ్చు. చెర్నోబిల్, వైట్ హౌస్ ప్లంబర్స్, వైట్ లోటస్, మేర్ ఆఫ్ ఈస్ట్‌టౌన్, బారీ, బిగ్ లిటిల్ లైస్, వెస్ట్‌వరల్డ్, సిలికాన్ వ్యాలీ, ట్రూ డిటెక్టివ్, న్యూస్‌రూమ్, గేమ్ ఆఫ్ థ్రోన్స్, పెర్రీ మాసన్, హ్యారీ పోటర్ సిరీస్, ది డార్క్ నైట్ ట్రిలోజి , బ్యాట్‌మ్యాన్ vs మూవీస్  సూపర్‌మ్యాన్, జస్టిస్ మూవీస్ జియోసినిమాలో అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం కంపెనీ ఈ ఒక్క ప్లాన్‌ను మాత్రమే అందిస్తోంది.

 వార్నర్ బ్రదర్స్, డిస్కవరీతో జియో కొత్త ఒప్పందంపై సంతకం చేసిందని గతంలో వార్తలు వచ్చాయి. Disney Plus అండ్  Hotstar కాకుండా వార్నర్ బ్రదర్స్ ప్రొడక్షన్స్ అన్నీ నేరుగా JioCinema యాప్ ద్వారా ప్రసారం చేయబడతాయి. ప్రస్తుతం, HBO Maxకి భారతదేశంలో ప్రత్యేకమైన స్ట్రీమింగ్ సర్వీస్ లేదు. వార్నర్ బ్రదర్స్ మరియు డిస్కవరీ బ్రాండ్‌లకు దేశంలో చాలా మంది అభిమానులు ఉన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

WhatsApp : ఇక పేరెంట్స్‌కు నో టెన్షన్.. పిల్లల వాట్సాప్ ను మీరే హ్యాండిల్ చేయవచ్చు, ఎలాగో తెలుసా?
LPG Cylinder Shortage : మీ కిచెన్ లో ఇవి ఉంటే చాలు.. గ్యాస్ సిలిండర్ లేకున్నా వండుకోవచ్చు