మీ చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉందా.. ? అయితే మీకు కూడా ఈ సమస్య ఉండవచ్చు!

By asianet news telugu  |  First Published May 13, 2023, 2:18 PM IST

లో యాంగ్జయిటీ కన్స్యూమర్ స్టడీ' అనే నివేదిక ఇటువంటి పరిస్థితి గురించి మాట్లాడింది. Oppo సేవలను మెరుగుపరచడంలో భాగంగా ఈ రీసర్చ్ నిర్వహించింది. రీసర్చ్ కోసం స్పందించిన చాలా మంది వారి స్మార్ట్‌ఫోన్‌ను సోషల్ మీడియా ఇంకా  కమ్యూనికేషన్ కోసం ఉపయోగిస్తున్నారు.


ఢిల్లీ: మీ ఫోన్ ఆఫ్ బ్యాటరీ అయిందని ఆందోళన చెందుతున్నారా..? అయితే మీకో  సమస్య ఉంది. దీనిని 'నోమోఫోబియా' అంటారు. ఫోన్ లేకుండా జీవించలేని జనరేషన్  ఎదుర్కొంటున్న మానసిక సమస్య ఇది. కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ అండ్ ఒప్పో శుక్రవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం, భారతదేశంలోని ప్రతి నలుగురిలో ముగ్గురు 'నోమోఫోబియా' బాధితులు. వీళ్లందరికీ ఫోన్‌కి దూరంగా ఉండటం భయంగా ఉంటుంది. దేశంలోని 72 శాతం మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు వారి ఫోన్ బ్యాటరీ 20 శాతం లేదా అంతకంటే తక్కువ ఉంటే ఆందోళన చెందుతున్నారు.

'నోమోఫోబియా: లో యాంగ్జయిటీ కన్స్యూమర్ స్టడీ' అనే నివేదిక ఇటువంటి పరిస్థితి గురించి మాట్లాడింది. Oppo సేవలను మెరుగుపరచడంలో భాగంగా ఈ రీసర్చ్ నిర్వహించింది. రీసర్చ్ కోసం స్పందించిన చాలా మంది వారి స్మార్ట్‌ఫోన్‌ను సోషల్ మీడియా ఇంకా  కమ్యూనికేషన్ కోసం ఉపయోగిస్తున్నారు. 65 శాతం మంది ప్రజలు వారి ఫోన్ బ్యాటరీని అయిపోకుండా ఫోన్ వినియోగాన్ని తగ్గించుకున్నారు. 81 శాతం మంది వారి ఫోన్ బ్యాటరీ అయిపోకుండా   ఉండేందుకు  సోషల్ మీడియా వినియోగాన్ని లిమిట్  చేశారు.

Latest Videos

ప్రస్తుత కాలంలో స్మార్ట్‌ఫోన్‌లు వ్యక్తిగత జీవితంలో భాగమైపోయాయి. వ్యక్తులు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఇంకా వినోదం కోసం ఒకరికొకరు కనెక్ట్ అవుతారు. దీని వల్ల వినియోగదారులు బ్యాటరీ డ్రైనైయింగ్ ఇంకా ఫోన్ పాడైపోతుందని ఆందోళన చెందుతున్నారు. 31 నుండి 40 సంవత్సరాల వయస్సు వారు లో బ్యాటరీ  గురించి ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు ఈ లెక్కన వెనుకబడి ఉన్నారు.

click me!